విజయ్ ప్రభుత్వాన్ని పడదోసే కుట్ర?.. మాజీ మంత్రి
Actor ProfilePolitician

విజయ్ ప్రభుత్వాన్ని పడదోసే కుట్ర?.. మాజీ మంత్రి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విజయ్ ప్రభుత్వాన్ని పడదోసే కుట్ర?.. మాజీ మంత్రిపై లుకౌట్ నోటీస్
AP7AM18 Sept 2026
విజయ్ ప్రభుత్వాన్ని పడదోసే కుట్ర?.. మాజీ మంత్రిపై లుకౌట్ నోటీస్

తమిళనాడులో కొత్తగా ఏర్పాటైన సీఎం జోసెఫ్ విజయ్ (టీవీకే) ప్రభుత్వాన్ని పడదోసేందుకు కుట్ర జరుగుతోందన్న ఆరోపణలపై చెన్నై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో డీఎంకే మాజీ మంత్రి వి.సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు ఆర్ వి.అశోక్ కుమార్‌లపై శనివారం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానంలో స్పీకర్‌కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు ఒక టీవీకే ఎమ్మెల్యేకు రూ. 35 కోట్లు ఆఫర్ చేసినట్లు వస్తున్న ఆరోపణలపై పోలీసులు వేట సాగిస్తున్నారు.ఈ కేసులో జూన్ 29న ఉత్తంగరై టీవీకే ఎమ్మెల్యే ఎన్. ఇళయరాజా ఫిర్యాదు చేశారు. ఒక ఒపీనియన్ పోలింగ్ సంస్థ అధినేతనని చెప్పుకుంటూ ఒక వ్యక్తి ఒక ‘ప్రధాన రాజకీయ పార్టీ’ తరఫున తనకు కోట్ల రూపాయల లంచం ఆఫర్ చేశాడని, దాన్ని తిరస్కరించడంతో తన కుటుంబానికి ప్రాణహాని కలిగించేలా బెదిరింపులకు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ట్రిప్లికేన్ పోలీసులు ప్రధాన నిందితుడు తిరునావుక్కరసుతో పాటు ఆయన అనుచరులు నరేష్, త్యాగరాజన్‌ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరి విచారణలో ఈ కుట్ర అంతా సెంథిల్ బాలాజీ, అశోక్ కుమార్ల ప్రత్యక్ష ఆదేశాల మేరకే జరిగినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. జులై 6న (సోమవారం) విచారణకు హాజరుకావాలని కరూర్ జిల్లా రామేశ్వరపట్టిలోని సెంథిల్ బాలాజీ పూర్వీకుల నివాసంలో సమన్లు కూడా జారీ చేశారు.శాసనసభ్యులను ప్రలోభపెట్టేందుకు ఏకంగా రూ. 180 కోట్లు కేటాయించారని దర్యాప్తులో తేలడంతో.. పరారీలో ఉన్న నిందితుల కోసం కరూర్, తిరుచిరాపల్లి, కోయంబత్తూర్, బెంగళూరులలో ప్రత్యేక