విజయ్ ను టార్గెట్ చేస్తూ మరోసారి త్రిష
Actor ProfilePolitician

విజయ్ ను టార్గెట్ చేస్తూ మరోసారి త్రిష

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విజయ్ ను టార్గెట్ చేస్తూ మరోసారి త్రిషపై వ్యాఖ్యలు.. ఏఐఏడీఎంకే నేత ఏమన్నారంటే
Andhra Jyothy3 Dec 2026
విజయ్ ను టార్గెట్ చేస్తూ మరోసారి త్రిషపై వ్యాఖ్యలు.. ఏఐఏడీఎంకే నేత ఏమన్నారంటే

డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతుండగానే.. తాజాగా ఏఐఏడీఎంకే సీనియర్ నేత ఆర్‌బీ ఉదయకుమార్ కూడా త్రిషను ప్రస్తావిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై విమర్శలు చేశారు. ఇంటర్నెట్ డెస్క్: నటి త్రిష పేరును ప్రస్తావిస్తూ తమిళ రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతుండగానే.. తాజాగా ఏఐఏడీఎంకే సీనియర్ నేత ఆర్‌బీ ఉదయకుమార్ కూడా త్రిషను ప్రస్తావిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై విమర్శలు చేశారు. తూత్తుకుడిలో జరిగిన జయలలిత పేరవై సమావేశంలో ఆర్‌బీ ఉదయకుమార్ మాట్లాడారు (Trisha Vijay controversy). 'విజయ్‌కు ఇష్టమైన త్రిషను తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఎప్పుడు నియమిస్తారోనని తమిళనాడు ప్రజలు ఎదురుచూస్తున్నారు' అని ఉదయకుమార్ అన్నట్టు వార్తలు వచ్చాయి. ప్రధానంగా కావేరీ నీటి వివాదాన్ని ప్రస్తావిస్తూ తమిళనాడు ప్రభుత్వంపై ఉదయకుమార్ విమర్శలు చేశారు. కర్ణాటక నుంచి తమిళనాడుకు రావాల్సిన కావేరీ నీటిని సాధించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. అదే సమయంలో త్రిష గురించి కూడా మాట్లాడారు (RB Udhayakumar Trisha remarks). ఉదయకుమార్ వ్యాఖ్యలపై త్రిష అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు (Vijay Tamil Nadu politics). మదురైలో త్రిష అభిమానుల సంఘం ఆధ్వర్యంలో పోస్టర్లు ఏర్పాటు చేసి ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ఒక నటిని రాజకీయ విమర్శలకు ఉపయోగించడం సరికాదంటూ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్‌ ముందు ట్రంప్ కొత్త డిమాండ్.. అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు