విజయ్ దళపతిని సీట్ అడిగిన స్టార్ డైరెక్టర్ ఎవరు? హింట్ ఇచ్చిన టీవీకే మంత్రి
Actor ProfilePolitician

విజయ్ దళపతిని సీట్ అడిగిన స్టార్ డైరెక్టర్ ఎవరు? హింట్ ఇచ్చిన టీవీకే మంత్రి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విజయ్ దళపతిని సీట్ అడిగిన స్టార్ డైరెక్టర్ ఎవరు? హింట్ ఇచ్చిన టీవీకే మంత్రి
Asianet News Telugu21 Jan 2027
విజయ్ దళపతిని సీట్ అడిగిన స్టార్ డైరెక్టర్ ఎవరు? హింట్ ఇచ్చిన టీవీకే మంత్రి

సుమారు ఏడాదిన్నర క్రితం జరిగిన ఓ సంఘటనను టీవీకే మంత్రి బుస్సీ ఆనంద్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. గుర్తు చేసుకున్నారు. విజయ్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఓ ప్రముఖ దర్శకుడు, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక నియోజకవర్గాన్ని కేటాయించమని విజయ్‌ను అడిగారట. ఈ విషయాన్ని ఆనంద్ సభలో వెల్లడించారు. ‘ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న జిల్లా కార్యదర్శిని కాదని, మీకు ఆ నియోజకవర్గాన్ని ఎలా ఇవ్వగలను?’ అని విజయ్ ఆ దర్శకుడితో అన్నట్లు బుస్సీ ఆనంద్ వివరించారు. పార్టీ కోసం కష్టపడేవారికే విజయ్ విలువిస్తారని చెప్పేందుకే ఈ ఉదాహరణ అని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో పదవుల కన్నా, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకే విజయ్ ఇంపార్టెన్స్ ఇస్తారని ఈ ఘటన చెబుతోందని బుస్సీ ఆనంద్ అన్నారు. ఆయన ఈ సీక్రెట్ బయటపెట్టగానే, ఆ డైరెక్టర్ ఎవరంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో వెతకడం మొదలుపెట్టారు. కానీ, అసెంబ్లీలోనే దానికి సమాధానం దొరికిందని, ఆ డైరెక్టర్ ఎవరో కూడా డీకోడ్ చేస్తున్నారు. బుస్సీ ఆనంద్ ఆ డైరెక్టర్ గురించి మాట్లాడుతుండగా, అసెంబ్లీలో ఉన్న తవెక ఎమ్మెల్యే, వ్యవసాయ మంత్రి వినోత్.. తన పక్కనే ఉన్న విగ్నేష్ వైపు సైగ చేశారట. ప్రస్తుతం మంత్రిగా ఉన్న విగ్నేష్, కినత్తుకడవు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ కినత్తుకడవుకు చెందిన దర్శకుడే లోకేష్ కనగరాజ్. కాబట్టి, విజయ్‌ను ఎమ్మెల్యే సీటు అడిగింది ఆయనేనని నెటిజన్లు అంటున్నారు. మాస్టర్, లియో వంటి రెండు బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన లోకేష్‌కే విజయ్ సీటు ఇవ్వలేదన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది

వ జయ దళపత న స ట అడ గ న స ట ర డ ర క టర ఎవర హ ట ఇచ చ న ట వ క మ త ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in