విజయ్ కు సుప్రీం బిగ్ షాక్..! మంత్రుల
Actor ProfilePolitician

విజయ్ కు సుప్రీం బిగ్ షాక్..! మంత్రుల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విజయ్ కు సుప్రీం బిగ్ షాక్..! మంత్రులపై రేపు విచారణ
Oneindia Telugu25 Sept 2026
విజయ్ కు సుప్రీం బిగ్ షాక్..! మంత్రులపై రేపు విచారణ

తమిళనాడులో గతేడాది చోటు చేసుకున్న కరూర్ తొక్కిసలాట (Karur Stampede) వ్యవహారం సీఎం విజయ్ ను ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ కేసులో అప్పట్లో నిందితులుగా ఉన్న వారు ప్రస్తుతం విజయ్ కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. వీరు ప్రస్తుతం జరుగుతున్న సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సుప్రీంకోర్టు జోక్యం కోరుతూ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.హైకోర్టు హద్దు దాటింది..! సుప్రీం మెట్లెక్కిన విజయ్..!కరూర్ తొక్కిసలాట ఘటనపై గతంలో కోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. విచారణలో భాగంగా రెండుసార్లు ఢిల్లీకి విజయ్ ను రప్పించి వివరాలు తీసుకుంది. అయితే తాజాగా విజయ్ కేబినెట్లోని మంత్రులు ఈ కేసులో సాక్ష్యుల్ని ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇదే కారణంతో తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. దీంతో కరూర్ తొక్కిసలాట కేసులో నిందితులుగా ఉండి, ప్రస్తుతం తమిళనాడు కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కొందరు వ్యక్తులు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అందుకే అన్నాడీఎంకేను చీల్చేస్తున్న విజయ్ ? గుట్టు బయటపెట్టిన మాజీ స్పీకర్..! సుప్రీంకోర్టుోల జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని రేపు విచారించనుంది. ఇందులో ప్రస్తుతం జరుగుతున్న కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తును విజయ్ మంత్రులు ప్రభావితం చేస్తున్నారని తేలితే సుప్రీంకోర్టు కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరూర్ తొక్కిసలాట కేసు విషయంలో విజయ్ ఎలా ముందుకు వెళ్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది

వ జయ క స ప ర బ గ ష క మ త ర ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in