
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Vijayawada Bus Fire Accident: విజయవాడలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన ఆటోనగర్‌లో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక మెకానిక్ షెడ్డులో రిపేర్ కోసం నిలిపి ఉంచిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షణాల వ్యవధిలోనే మంటలు పక్కపక్కనే ఉన్న ఇతర వాహనాలకు వ్యాపించడంతో, మొత్తం ఏడు లగ్జరీ బస్సులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిదంటే? సాధారణంగా వీకెండ్ కావడంతో ఆదివారం రాత్రి హైదరాబాద్, ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను చిన్న చిన్న మరమ్మతుల కోసం ఆటోనగర్‌లోని షెడ్డుకు తీసుకువచ్చారు. ఒక బస్సుకు మెకానిక్ పని చేస్తుండగా అకస్మాత్తుగా అందులోంచి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఆ మంటలు ఉధృతంగా మారి, పక్కనే పార్క్ చేసి ఉన్న మిగతా ఆరు బస్సులను కూడా దహించివేశాయి. ఎగసిపడిన దట్టమైన పొగలు.. ప్రమాద స్థలం నుండి దట్టమైన నల్లటి పొగలు, పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా కాసేపు ఉత్కంఠ నెలకొంది. చుట్టుపక్కల వందలాది ఇతర వాహనాలు కూడా నిలిపి ఉంచడంతో, మంటలు వాటికి కూడా వ్యాపిస్తాయేమోనని స్థానికులు, గ్యారేజ్ కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు. రంగంలోకి మూడు ఫైర్ ఇంజన్లు స్థానికులు తక్షణమే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే మూడు ఫైర్ ఇంజన్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫైర్‌ఫైటర్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అగ్నిమాపక సిబ్బంది వచ్చే సమయానికే ఏడు బస్సులు పూర్తిగా