
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Chikungunya Symptoms: భారీ వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో కేరళలో చికెన్ గున్యా ,మలేరియా కేసులు పెరుగుతున్నాయి. దోమల విజృంభణ కారణంగా తిరువనంతపురంలో ఇన్ఫెక్షన్ తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఈజిప్టి మస్కిటోల వల్ల పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. చికెన్ గున్యా ప్రాణాంతకం కాకపోయినా, దీనివల్ల తీవ్రమైన జ్వరం, కీళ్ల నొప్పులు, ఎక్కువ కాలం పాటు నీరసం వంటి సమస్యలు వస్తాయి. పిల్లల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నందున తల్లిదండ్రులు ముందుగానే అప్రమత్తంగా ఉండాలి. చికెన్ గున్యా అనేది ఒక వైరస్, ఇది ఈజిప్టియన్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. నీరు నిల్వ ఉండే పాత బకెట్లు, టైర్లు, కూలర్లు, కొబ్బరి చిప్పల వంటి చోట్ల దోమలు పెరిగి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉంటే ఏ సమయంలోనైనా దోమలు మనల్ని కుట్టే ప్రమాదం ఉంది. చికెన్ గున్యా లక్షణాలు.. పిల్లల్లో చికెన్ గున్యా సోకినప్పుడు అకస్మాత్తుగా జ్వరం రావడం, విపరీతమైన కీళ్ల నొప్పులు, వాపులు, కండరాల నొప్పి, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల్లో కీళ్ల నొప్పులు పెద్దవారి కంటే కొంచెం తక్కువగా ఉండవచ్చు, కానీ ఈ లక్షణాలను వెంటనే గమనించాలి. చికెన్ గున్యాకు చికిత్స.. ప్రస్తుతం చికెన్ గున్యాకు ప్రత్యేకమైన యాంటీ వైరల్ మందులు ఏవీ లేవు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు పిల్లలు ఎక్కువగా నీరసపడతారు కాబట్టి వారికి తగినంత విశ్రాంతి, హైడ్రేషన్ అవసరం. వెంటనే వైద్యులను సంప్రదించి, జ్వరం తగ్గడానికి పారాసిటమాల్ వంటి మందులు వాడాలి. రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది, తద్వారా వైద్యులు తగిన మందులు