వికారాబాద్ జిల్లాలో నకిలీ డీఏపీ కలకలం.. ఆందోళనలో రైతులు
Actor ProfilePolitician

వికారాబాద్ జిల్లాలో నకిలీ డీఏపీ కలకలం.. ఆందోళనలో రైతులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వికారాబాద్ జిల్లాలో నకిలీ డీఏపీ కలకలం.. ఆందోళనలో రైతులు
Andhra Jyothy7 Dec 2026
వికారాబాద్ జిల్లాలో నకిలీ డీఏపీ కలకలం.. ఆందోళనలో రైతులు

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో నకిలీ డీఏపీ ఎరువును రైతులు పట్టుకున్నారు. వాటిని వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు. వికారాబాద్, ఆగస్టు12: రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో నకిలీ ఎరువు వెల్లువెత్తింది. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో నకిలీ డీఏపీ ఎరువును రైతులు పట్టుకున్నారు. వాటిని వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు. దీంతో నకిలీ డీఏపీ ఎరువును వరంగల్‌లోని ఎఫ్‌సీవో ల్యాబ్‌‌ (FCO - Fertilizer Control Order)కు తరలించారు. ఈ నేపథ్యంలో ల్యాబ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వెలువడే ఫ్లైయాష్, ఉప్పు ద్రావణంతో ఈ నకిలీ డీఏపీ ఎరువును తయారు చేస్తున్నట్లు ఎఫ్‌సీవో గుర్తించింది. 18 శాతం ఉండాల్సిన నైట్రోజన్ 1.12 శాతం, 46 శాతం ఉండాల్సిన ఫాస్పరస్ 0.77 శాతం మాత్రమే నమోదయినట్లు గుర్తించారు. ఎఫ్‌సీవో ల్యాబ్ పరీక్షల్లో ఈ నకిలీ డీఏపీ.. పూర్తిగా నాన్ స్టాండర్డ్‌ అని తేల్చారు. కేవలం వాసన కోసం రసాయనాలు కలిపి.. ఆ బస్తాల్లో ఫ్లైయాష్ నింపుతున్నట్లు కనుగొన్నారు. అయితే ఈ నకిలీ డీఏపీ మార్కెట్‌ను ముంచెత్తినా.. కేవలం ఇద్దరిపైన మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు కూడా స్పందించడం లేదు. దీంతో పోలీసులు, ఉన్నతాధికారుల వైఖరిపై రైతులు మండిపడుతున్నారు. రైతులకు ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ నకిలీ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రజాసంఘాల డిమాండ్ చేస్తున్నాయి. అలాగే నకిలీ డీఏపీ కొనుగోలు చేసిన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరాయి. పంజాగుట్ట శ్మశాన వాటికలో పసికందు మృతదేహం మాయం.. దర్యాప్తు ముమ్మరం ఎల్బీనగర్ పీఎస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య