
చీపురుపల్లి: డీఎస్సీలో అక్రమాలపై విచారణ జరిపించాలని, ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైకాపా చేపట్టిన నిరసన ర్యాలీకి అనుమతులు లేకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. చీపురుపల్లిలోని విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిలో ఆంజనేయపురం వద్ద నుంచి ర్యాలీని ప్రారంభించేందుకు శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, బొత్స కుమార్తె అనూష, నాలుగు మండలాల నాయకులు రోడ్డుమీదకి రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పార్టీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రధాన రహదారిలో కాసేపు బైఠాయించి నిరసన తెలిపారు. గరివిడి వైపు ర్యాలీ చేసుకుంటామంటూ వెనక్కి వెళ్లడంతో ఆ వైపు వెళ్లడానికి వీలు లేదంటూ మరోమారు పోలీసులు అడ్డగించారు. దీంతో చేసేది ఏమీ లేక బొత్స విలేకరులతో మాట్లాడి వెనక్కి వెళ్లిపోయారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు