వికసితం నుంచి వైభవం వైపు.. ఆంధ్రప్రదేశ్
Actor ProfilePolitician

వికసితం నుంచి వైభవం వైపు.. ఆంధ్రప్రదేశ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వికసితం నుంచి వైభవం వైపు.. ఆంధ్రప్రదేశ్ పై చంద్రబాబు భారీ లక్ష్యం
NTV Telugu24 Dec 2026
వికసితం నుంచి వైభవం వైపు.. ఆంధ్రప్రదేశ్ పై చంద్రబాబు భారీ లక్ష్యం

CM Chandrababu: అమరావతిలోని రాయపూడి పరేడ్ గ్రౌండ్స్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. దేశం మనకు హక్కులు, గుర్తింపు, గౌరవం ఇచ్చిందని, ఇప్పుడు దేశానికి మనం ఏం చేయగలమో ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. దేశమే నా బాధ్యత.. ప్రతి ఒక్కరిలో సంకల్పం ఉండాలి దేశం మనకు ఎంతో ఇచ్చిందని, అందుకే “దేశమే నా బాధ్యత” అనే ఆలోచనతో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి చేతిలో జాతీయ జెండా ఉండటంతో పాటు, గుండెల్లో బలమైన అజెండా ఉండాలని అన్నారు. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు వచ్చే 20 ఏళ్లకు అనుసంధానమైన ప్రణాళికతో పనిచేస్తామని ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంకల్పం తీసుకోవాలని సూచించారు. దేశానికి మనం ఏం ఇవ్వగలం అనే ఆలోచనే “అనే నేను..” అనే సంకల్పానికి మూలమని పేర్కొన్నారు. సమాజ హితం కోసం పనిచేయాలి తాము చేసే ప్రతి పని దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, సమాజ హితం కోసం ఉండాలని చంద్రబాబు అన్నారు. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను ఉపయోగించి ఆవిష్కరణలు సాధించాలని, రైతులు ప్రకృతి సాగు ద్వారా ప్రజల ఆరోగ్యంతో పాటు భూసారాన్ని కాపాడాలని సూచించారు. ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తూ సమాజం పట్ల తమ బాధ్యతను నెరవేర్చాలని అన్నారు. మహిళలు అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలని పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వామి కావాలని సూచించారు. ఆలోచన చిన్నదైనా.. సంకల్పం గొప్పగా ఉండాలి ఒక వ్యక్తిగా తమ ఆలోచన చిన్నదిగా ఉన్నప్పటికీ, దేశం కోసం చేసే సంకల్పం మాత్రం గొప్పదిగా ఉండాలని చంద్రబాబు అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలకు మించి దేశ ప్రయోజనాలను దృష్టిలో