వశిష్ఠ డైరెక్షన్ లో నందమూరి సింబా మోక్షజ్ఞ సినిమా ఫిక్స్
Actor ProfileActor

వశిష్ఠ డైరెక్షన్ లో నందమూరి సింబా మోక్షజ్ఞ సినిమా ఫిక్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వశిష్ఠ డైరెక్షన్ లో నందమూరి సింబా మోక్షజ్ఞ సినిమా ఫిక్స్
NTV Telugu15 Jan 2027
వశిష్ఠ డైరెక్షన్ లో నందమూరి సింబా మోక్షజ్ఞ సినిమా ఫిక్స్

నందమూరి అభిమానులకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెరపడే రోజు రాబోతుంది. చాలా కాలంగా అదిగో ఇదిగో అంటూ వస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ‘బింబిసార’, ‘విశ్వంభర’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల దర్శకుడు వశిష్ట ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించబోతున్నారనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. వాస్తవంగా హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షు ఎంట్రీకి అన్ని ప్లాన్ చేసి చివరి నిమిషంలో ఆ సినిమాను క్యాన్సిల్ చేసారు. ఇక దాదాపు ఏడాది తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఎంట్రీకి రెడీ అవుతున్నాడు మోక్షు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం దర్శకుడు వశిష్ట ఒక వినూత్నమైన కథను సిద్ధం చేశారని, దానికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. రాబోయే దసరా పండగ పర్వదినాన ఈ చిత్రాన్ని లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రకటనతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. నిజానికి, ఈ పాటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఇటీవల బాలకృష్ణ యాక్షన్ సీన్ షూటింగ్‌లో గాయపడటం, ఆ తర్వాత ఆయన మోకాలికి సర్జరీ జరగడం వంటి ఊహించని పరిణామాల వల్ల ఈ ప్రకటన కాస్త ఆలస్యమైంది. బాలయ్య కోలుకోవడానికి సమయం పట్టడంతో ఈ గ్రాండ్ అనౌన్స్‌మెంట్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందట. ఇక ఇప్పుడు బాలయ్య కూడా రికవరీ అవడం, పరిస్థితులు అన్ని అనుకూలించడంతో దసరా సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు

వశ ష ఠ డ ర క షన ల న దమ ర స బ మ క షజ ఞ స న మ ఫ క స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in