ప్రేమ వెలగబెట్టిన ఘనకార్యం గురించి నిలదీస్తుంది నర్మద. ఎంత చెప్పినా వినకుండా వెళ్లి.. ఆ రాజపుష్పం చేతిలో నలిగిపోయేది ప్రేమ. సమయానికి ధీరజ్ వెళ్లాడు కాబట్టి.. నలిగిపోకుండా బయటపడింది కానీ.. లేదంటే ఈపాటి ఓ మూలన కూర్చుని ‘రామచక్కని తల్లీ రాములమ్మో రాములమ్మో’ అని ఏడ్చుకుంటూ కూర్చునేది. అయితే ప్రేమ ఏ పని చేసినా కూడా ధీరజ్‌కి అయినా చెప్పకుండా ఉంటుందేమో కానీ.. నర్మదకి చెప్పకుండా చేయదు. అయితే ఈ డాన్స్ కాంపిటేషన్ విషయాన్ని తన దగ్గర దాచడంతో హర్ట్ అవుతుంది నర్మద. ఈరోజు (జూలై 06) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. ఆల్రెడీ నా మొగుడు కొట్టడం తిట్టడం అయిపోయింది.. నువ్వు కోపంగా చూడొద్దు.. కొడితే కొట్టేయ్.. కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా అన్నట్టుగా చూస్తున్నావ్’ అని అంటుంది ప్రేమ. దాంతో అప్పటి వరకూ సీరియస్‌గా ఉన్న నర్మ పెద్దగా నవ్వుతూ.. ‘నీ భర్తపై నీకున్న ప్రేమని చూస్తుంటే ముచ్చటేస్తుంది ప్రేమా.. కానీ నువ్వు ఎవరితోనూ చెప్పకుండా వెళ్లడమే నచ్చలేదు. ఇంకెప్పుడూ అలా చేయొద్దు’ అంటూ సుతిమెత్తగా హెచ్చరిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ‘బల్లీ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు.. ఆరోజు నువ్వు డాన్స్ క్లాస్‌కి వెళ్తేనే మామయ్యకి చెప్పి రచ్చ చేసింది.. ఇప్పుడు నువ్వు డాన్స్ కాంపిటేషన్‌కి వెళ్లి వచ్చావ్ అని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అని భయపెడుతుంది నర్మద.వల్లీ కడుపు పెద్ద నాటకం.. ఆధారాలతో సహా కనిపెట్టేశా అవునక్కా.. బల్లీ అంటే గుర్తొచ్చింది.. ఇంతకీ ఆ బల్లీ కడుపు నాటకం ఎంత వరకూ వచ్చింది? ఏమైంది? అని అడుగుతుంది ప్రేమ. ఆ బల్లీ కడుపు పెద్ద నాటకం.. ఆధారాలతో సహా కనిపెట్టేశాను. అందరి ముందు బయటపెట్టడమే మిగిలిఉంది అంటూ డాక్టర్లతో ఆడించిన నాటకం మొత్తం బయటపెడుతుంది నర్మద. ఇదొక్కటే కాదు.. బల్లీకి అబార్షన్ చేసింది డాక్టరే కాదు.. మెరుపుతీగ పేరుతో ఆ హాస్పిటల్‌లో ఎవరూ లేరంట
Actor ProfileCelebrity
వల్లీ కడుపు గుట్టు రట్టు చేసిన సుకన్య
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•25 Sept 2026
వల్లీ కడుపు గుట్టు రట్టు చేసిన సుకన్య, మెరుపుతీగ.. వీళ్లు మిత్రులు కాదు శత్రువులు’.. నిజం చెప్పి వేదవతి