వర్షాల కోసం వరుణ యాగం.. సతీసమేతంగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
Actor ProfilePolitician

వర్షాల కోసం వరుణ యాగం.. సతీసమేతంగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వర్షాల కోసం వరుణ యాగం.. సతీసమేతంగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
AP7AM28 Nov 2026
వర్షాల కోసం వరుణ యాగం.. సతీసమేతంగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, జలాశయాలు జలకళను సంతరించుకోవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం 'మహా వరుణ యాగం' నిర్వహించింది. నాగార్జున సాగర్ సమీపంలోని కృష్ణా తీరంలో ఉన్న విజయ విహార్‌ వేదికగా ఈ క్రతువును శాస్త్రోక్తంగా జరిపించారు. యాగం ముగింపు సందర్భంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.ఈ ఏడాది రుతుపవనాలు బలహీనంగా ఉండటం, ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ యాగానికి శ్రీకారం చుట్టింది. ఉదయం నుంచి సాగిన ఈ క్రతువులో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కూడా పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన 108 మంది రుత్విక్కులు, వేద పండితుల పర్యవేక్షణలో 11 హోమ గుండాలతో ఈ యాగాన్ని వైభవంగా నిర్వహించారు.ప్రస్తుతం నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.045 టీఎంసీలు కాగా, కేవలం 145.65 టీఎంసీల మేర మాత్రమే నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం ఇది సుమారు 518 అడుగుల వద్దే కొనసాగుతోంది. గత ఏడాది ఇదే సమయానికి జలాశయం నిండుకుండలా ఉందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి, కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, చెరువులు నిండి అన్నదాతల పంటలు పచ్చగా ఉండాలన్న సంకల్పంతో ఈ యాగం నిర్వహించినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

వర ష ల క స వర ణ య గ సత సమ త గ ప ల గ న న స ఎ ర వ త ర డ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in