వరుణ్ తేజ్ మూవీకి రెండో వారంలో అదిరిపోయే కలెక్షన్లు.. కొరియన్ కనకరాజు ఎంత రాబట్టిందంటే
Actor ProfileActor

వరుణ్ తేజ్ మూవీకి రెండో వారంలో అదిరిపోయే కలెక్షన్లు.. కొరియన్ కనకరాజు ఎంత రాబట్టిందంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వరుణ్ తేజ్ మూవీకి రెండో వారంలో అదిరిపోయే కలెక్షన్లు.. కొరియన్ కనకరాజు ఎంత రాబట్టిందంటే
Asianet News Telugu2 Jan 2027
వరుణ్ తేజ్ మూవీకి రెండో వారంలో అదిరిపోయే కలెక్షన్లు.. కొరియన్ కనకరాజు ఎంత రాబట్టిందంటే

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ఇటీవల `కొరియన్‌ కనకరాజు` చిత్రంతో ఆడియెన్స్ ని పలకరించారు. ఆయన మొదటి సారి హర్రర్‌, థ్రిల్లర్‌, కామెడీ కాన్సెప్ట్ తో `కొరియన్‌ కనకరాజు` మూవీ చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రితిక నాయక్‌ హీరోయిన్‌గా నటించగా, సత్య, మురళీధర్‌ గౌడ్‌, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకాలపై తెరకెక్కిన చిత్రమిది. దీనికి ముందు అటు వరుణ్‌ తేజ్‌, ఇటు మేర్లపాక గాంధీకి హిట్లు లేవు. దీంతో వీరిద్దరు ఎలాగైనా హిట్‌ కొట్టాలనే లక్ష్యంతో ఈ మూవీని చేశారు. చాలా కసితో చేశారని చెప్పొచ్చు. ఆ కసి సినిమాలో కనిపిస్తుంది. ఆగస్ట్ 7న `కొరియన్‌ కనకరాజు` మూవీ విడుదలైంది. కామెడీ అంశాలు బాగా వర్కౌట్‌ అయ్యాయి. దీంతో సినిమా జనాలకు కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా సత్య కామెడీ హైలైట్‌గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే సినిమాకి నిజమైన హీరో అయనే అని చెప్పొచ్చు. అంతగా సినిమాని నడిపించాడు. వరుణ్‌ కి హిట్‌ రావడానికి కారకుడయ్యాడు. అలాగే మేర్లపాక గాంధీ టేకింగ్‌, రైటింగ్‌, మ్యూజిక్‌ వంటివన్నీ సినిమాకి ప్లస్‌ అయ్యాయి. మొత్తంగా వరుణ్‌ తేజ్‌ హిట్‌ కొట్టారు. బౌన్స్ బ్యాక్‌ అయ్యారు. ఇక ఈ మూవీ విడుదలై పది రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఈ చిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయి. ఎంత లాభాలు సాధించిందనేది చూస్తే. `కొరియన్‌ కనకరాజు` మూవీకి అయిన బడ్జెట్‌ రూ.38కోట్లు, థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.12కోట్లు అని సమాచారం. నాన్‌ థియేట్రికల్‌గానే దీనికి రూ.26కోట్ల వరకు వచ్చిందట. దీంతో పన్నెండు కోట్లని థియేట్రికల్‌గా నిర్ణయించారు. ఈ లెక్కన ఈ మూవీ మొదటి వారాంతంలోనే బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. ఇప్పుడు లాభాల దిశగా వెళ్తోంది. ఈ సినిమాకి పదిరోజుల్లో రూ.31.15కోట్లు వచ్చాయి. అంటే రూ.16కోట్ల షేర్‌ వచ్చింది. నాలుగు కోట్లకుపైగానే లాభాలు పొందింది. ఈ

వర ణ త జ మ వ క ర డ వ ర ల అద ర ప య కల క షన ల క ర యన కనకర జ ఎ త ర బట ట ద ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in