వదంతి 2' అమెజాన్ ప్రైమ్ సిరీస్ రివ్యూ
Actor ProfileActor

వదంతి 2' అమెజాన్ ప్రైమ్ సిరీస్ రివ్యూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వదంతి 2' అమెజాన్ ప్రైమ్ సిరీస్ రివ్యూ
AP7AM1 Dec 2026
వదంతి 2' అమెజాన్ ప్రైమ్ సిరీస్ రివ్యూ

తమిళంలో రూపొందిన సిరీస్ 'వదంతి'. సీజన్ 1కి సంబంధించిన ఈ సిరీస్, డిసెంబర్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ సిరీస్, 8 ఎపిసోడ్స్ గా ప్రేక్షకులను పలకరించింది. ఎస్. జె. సూర్య పోలీస్ ఆఫీసర్ గా రూపొందిన ఈ సిరీస్, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాంటి ఈ సిరీస్ కి సీజన్ 2 అందుబాటులోకి వచ్చింది. 8 ఎపిసోడ్స్ గా నిర్మితమైన ఈ సిరీస్ లో శశికుమార్ కథానాయకుడిగా నటించాడు. ఈ నెల 7వ తేదీ నుంచి వివిధ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 'చెన్నై' నుంచి 'మధురై'కి ఎనిమిది లైన్ల రోడ్ పనులు మొదలవుతాయి. అయితే మట్టి తీస్తుండగా, ఒక అస్థిపంజరం బయటపడుతుంది. ఈ విషయంలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవ నడుస్తూ ఉంటుంది. పనిష్మెంట్ పోస్టింగ్ పై వచ్చిన రాజా ( శశికుమార్) తన తోటి ఆఫీసర్ రామర్ ( వివేక్ ప్రసన్న)తో కలిసి ఈ కేసు వ్యవహారాలు చూస్తుంటాడు. ఎస్పీగా రతికా నాయర్ (అనఘా) రంగంలోకి దిగుతుంది. బయటపడిన అస్థిపంజరానికి ఒక చేయి లేకపోవడంతో మళ్లీ అక్కడ తవ్వకాలు జరుపుతారు. అప్పుడు వాళ్లకి అస్థి పంజరంలోని ఒక చేయి దొరుకుతుంది.అయితే రిపోర్ట్స్ లో అస్థిపంజరం ఒకరిది .. చేయి ఒకరిది అనే విషయం తేలుతుంది. ఆ రెండూ ఇద్దరు యువతులవనే విషయం స్పష్టమవుతుంది. దాంతో ఆ దిశగా విచారణ జరపడం మొదలవుతుంది. రెండేళ్ల క్రితం ఇద్దరు యువతులు అదృశ్యమైన కేసు రాజా దృష్టికి వస్తుంది. అలాగే ఆ ఇద్దరు యువతులకి సంబంధించిన హత్యానేరంలో 'మణి' అనే యువకుడు శిక్షను అనుభవిస్తున్నట్టు తెలుసుకుంటాడు. జైల్లో అతణ్ణి కలుసుకుని మాట్లాడతాడు.మణితో మాట్లాడిన తరువాత, ఆ హత్యలు అతను చేసి ఉండకపోవచ్చని రాజా భావిస్తాడు. అదే విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకుని వెళతాడు. పై అధికారుల నుంచి ఆమె పర్మిషన్ తీసుకురావడంతో, ఆ కేసును రీ