లైసెన్స్ నుంచి రెన్యూవల్ వరకు.. ఇంటి నుంచే 100 రవాణా సేవలు
Actor ProfilePolitician

లైసెన్స్ నుంచి రెన్యూవల్ వరకు.. ఇంటి నుంచే 100 రవాణా సేవలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లైసెన్స్ నుంచి రెన్యూవల్ వరకు.. ఇంటి నుంచే 100 రవాణా సేవలు, ఆఫీసుకు వెళ్లక్కర్లేదు
Samayam Telugu24 Oct 2026
లైసెన్స్ నుంచి రెన్యూవల్ వరకు.. ఇంటి నుంచే 100 రవాణా సేవలు, ఆఫీసుకు వెళ్లక్కర్లేదు

కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారు, డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లు ఆర్‌టీఏ కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగడం, గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడటం వంటి ఇబ్బందులకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఆధార్ ధ్రువీకరణ ఆధారంగా ఏకంగా 100 రకాల రవాణా సేవలను ఆన్‌లైన్‌ వేదికగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ విధానాన్ని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కూడా దశలవారీగా అమలు చేయడానికి పక్కా కార్యాచరణను సిద్ధం చేసింది.తెలంగాణలో ఇప్పటికే నాన్-ట్రాన్స్‌పోర్ట్ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు షోరూమ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లోనే సాగుతున్నాయి. అయితే, ఇప్పుడు ఆటోలు, లారీలు, బస్సులు వంటి కమర్షియల్ వాహనాల రిజిస్ట్రేషన్లు, ఇతర సేవలను కూడా ఆన్‌లైన్ పరిధిలోకి తెస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రవాణా కార్యాలయ పరిధిలో వారం రోజుల్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఇక్కడి ఫలితాల ఆధారంగా.. రాబోయే ఒకటి లేదా రెండు నెలల్లో ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.కేంద్ర ప్రభుత్వానికి చెందిన పరివాహన్, సారథి, ఈ-చలాన్ పోర్టళ్ల ద్వారా ఈ 100 సేవలను 9 విభాగాలుగా వర్గీకరించి ప్రజలకు అందించనున్నారు. ఆధార్ కార్డు బయోమెట్రిక్ సమస్యలు ఉన్నవారు ఇతర అధికారిక గుర్తింపు పత్రాలను సమర్పించి నేరుగా ఆర్‌టీఏ ఆఫీసుల్లో సేవలు పొందవచ్చు. రోడ్డు భద్రతకు అత్యంత కీలకమైన డ్రైవింగ్ లైసెన్స్ ప్రాక్టికల్ పరీక్ష, వాహన ఫిట్‌నెస్ ఫిజికల్ పరీక్షలకు మాత్రమే వాహనదారులు నేరుగా ఆర్‌టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. మిగిలిన అన్ని ప్రక్రియలు ఇంటి నుంచే పూర్తి చేసుకోవచ్చు. లైసెన్స్ సేవలు (21 రకాలు): కొత్త డ్రైవింగ్ లైసెన్స్ జారీ, రెన్యూవల్, అడ్రస్ లేదా పేరు మార్పు, డూప్లికేట్ లైసెన్స్, అంతర్జాతీయ పర్మిట్, స్మార్ట్ కార్డ్ వంటివి. పి.ఎస్.వి బ్యాడ్జ్ (2 సేవలు): ఆటో, క్యాబ్ డ్రైవర్ల కొత్త మరియు డూప్లికేట్ బ్యాడ్జ్ జారీ. కండక్టర్

ల స న స న చ ర న య వల వరక ఇ ట న చ 100 రవ ణ స వల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in