భారత క్రికెట్ గమనాన్ని మార్చిన ధీశాలి, దూకుడుతనానికి మారుపేరైన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా క్రీడా, సినీ అభిమానులకు అదిరిపోయే కానుక అందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘దాదా’ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆయన అధికారిక బయోపిక్ ‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం బుధవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్‌కుమార్ రావ్ టైటిల్ రోల్ పోషిస్తుండటం విశేషం. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాజ్‌కుమార్ రావ్.. అచ్చుగుద్దినట్లు సౌరవ్ గంగూలీలాగే ఒదిగిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు.* ఒక్క ఐడియా సినిమా రిజల్ట్‌నే మార్చేసింది.. ఫ్లాప్ నుంచి క్లాసిక్‌గా మారిన ‘మాతృదేవోభవ’లార్డ్స్ ఐకానిక్ మూమెంట్ రీక్రియేషన్భారత క్రికెట్ చరిత్రలోనే కాక, ప్రపంచ క్రీడా రంగంలోనే అత్యంత చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయిన లార్డ్స్ బాల్కనీ సెలబ్రేషన్స్‌ను ఈ పోస్టర్‌లో అద్భుతంగా ఆవిష్కరించారు. 2002లో ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ సాధించిన ఉత్కంఠభరిత విజయం తర్వాత.. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ బాల్కనీలో గంగూలీ తన జెర్సీని విప్పి గాల్లో ఊపుతూ చేసిన సందడి భారత క్రికెట్‌లో సరికొత్త శకానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. సరిగ్గా అదే ఐకానిక్ మూమెంట్‌ను రాజ్‌కుమార్ రావ్‌పై సినిమాటిక్‌గా రీక్రియేట్ చేసిన విధానం పోస్టర్‌కే హైలైట్‌గా నిలిచింది. భారత క్రికెట్‌లో ధైర్యాన్ని నూరిపోసిన దాదా శైలిని ఈ లుక్ ప్రతిబింబిస్తోంది.* సూర్య ఈజ్ బౌన్స్ బ్యాక్... ‘కరుప్పు’ సక్సెస్‌తో ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్? కేవలం క్రికెట్ ఆడిన ఆటగాడి కథగానే కాకుండా, దేశంలో ఆ ఆట తీరునే మార్చేసిన ఒక అసాధారణ నాయకుడి ప్రయాణంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కోల్‌కతా వీధుల్లో సాదాసీదాగా మొదలైన గంగూలీ ప్రయాణం.. లార్డ్స్ మైదానం వరకు ఎలా సాగింది, ఒక తరం క్రికెటర్లకు ఆయన ఎలా రోల్ మోడల్‌గా నిలిచారనే
Actor ProfileActor
లార్డ్స్ బాల్కనీ సీన్ రీక్రియేషన్.. గంగూలీ బయోపిక్ దాదా’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•9 Oct 2026
లార్డ్స్ బాల్కనీ సీన్ రీక్రియేషన్.. గంగూలీ బయోపిక్ దాదా’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా