
అమరావతి: సీఆర్డీఏ సమావేశంలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024 జూన్ నుంచి భూములిచ్చిన వారికి రూ.40వేలు కౌలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. భూములు ఇచ్చినప్పటి నుంచి 10ఏళ్లపాటు ఇది అమలు కానుంది. గ్రామకంఠాల్లో భూమి కోల్పోతున్న వారికి ఏటా రూ.10వేలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా పూలింగ్ జరిగే గ్రామాల రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి 6లోగా రుణం తీసుకున్న వారికి ఈ మాఫీ అమలవుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 63వ సీఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండో దశ పూలింగ్‌లో భూములిచ్చిన రైతుల గురించి చర్చించారు. రైతులకు యాన్యుటీ, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు, మంత్రుల కమిటీ సిఫారసు మేరకు వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించారు. ఇనాం భూముల కోసం దేవాదాయశాఖకు రూ.159 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమరావతి 25 టౌన్‌షిప్‌ల్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉండేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాత్రిలోగా భూములివ్వనివారికి రేపు భూ సేకరణ అమలు చేస్తామన్నారు. ఇప్పటికే ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ 2.5 ఎకరాలకు అమలు చేస్తున్నామని తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. నంద్యాల డేనియల్‌పురం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ముందు వందలాది మంది గుమిగూడారు. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) 45వ