లాయర్ గా కంటే కంటెంట్ క్రియేటర్ గానే ఎక్కువ సంపాదించా
Actor ProfileActor

లాయర్ గా కంటే కంటెంట్ క్రియేటర్ గానే ఎక్కువ సంపాదించా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లాయర్ గా కంటే కంటెంట్ క్రియేటర్ గానే ఎక్కువ సంపాదించా
Sakshi10 Dec 2026
లాయర్ గా కంటే కంటెంట్ క్రియేటర్ గానే ఎక్కువ సంపాదించా

స్థిరమైన ఆదాయం అంటే..రిస్క్‌లు, టెన్షన్‌ లేని జాబ్‌ అనిపిస్తుంది. అలాంటి మంచి ఉద్యోగాన్ని వదులుకోవాలని అనిపించదు. ఇక్కడ ఈ మహిళ కూడా లాయర్‌గా మంచి జీతం ఆర్జిస్తోంది. చెప్పాలంటే వెల్‌ సెటిల్‌ జాబ్‌ అనొచ్చు. అలాంటి ఉద్యోగాన్ని వద్దనుకుని జస్ట్ పదివేలు జీతం ఇచ్చే జాబ్‌వైపుకి మొగ్గు చూపింది. ఆ తర్వాత ఏమైందంటే.. ఆ మహిళే మెహర్ వర్మ టాక్స్‌ లాయర్‌గా హాయిగా నెలకు రూ. 1 లక్ష దాక జీతం పొందేది. అలాంటి ఉద్యోగాన్ని రూ. 10 వేలు జీతం ఇచ్చే జాబ్‌ కోసం వదిలేసింది. ఇదేంటిది అని విస్తుపోకండి. స్వేచ్చగా పనిచేసే జాబ్‌ కోసం ఇదంతా చేసింది. హాయిగా కంటెంట్‌ క్రియేటర్‌గా ఆర్జించేందుకు ఇలా చేసింది. మరి నిలదొక్కుకుందా అంటే..మూడేళ్ల తర్వాత ఏకంగా అంతకురెట్టింపు కంటెంట్‌ క్రిఏయటర్‌ కమ్‌ సోషల్‌ మీడియ స్టాటజిస్ట్‌గా ఆర్జించింది. అ యితే స్థిరమైన ఉద్యోగం వదిలేయడం అంటే చాలా పెద్ద రిస్క్‌ అని అంగీకరించిందామె. అయితే తన నిర్ణయం చివరికి ఫలించి..ఎక్కువ ఆర్జించగలిగానంటోంది. అంతకుముందు టాక్స్‌ లాయర్‌గా చేస్తూ.మంచి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పోందాను, పైగా కంపెనీ కూడా బాగుందని పేర్కొంది. అయితే రాను రాను శని, ఆదివారాలు రాగానే సోమవారం అంటే భయమేసిందని చెప్పింది. దాంతో చక్కగా మధ్యలో కంటెంట్‌ క్రియేటర్‌గా వీడియోలు షేర్‌ చేస్తూ ఉండేది. అలా తన పూర్తికాలపు ఉద్యోగం తోపాటు కంటెంట్‌ క్రియేషన్‌ను కూడా బ్యాలెన్స్‌ చేసేందుకు ట్రై చేసినట్లు తెలిపింది. అందుకోసం ఫోటోగ్రఫీ కోర్సు కూడా చేసినట్లు వెల్లడించింది. చివరికి క్రియేటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం ప్రారంభించానని, కానీ రిజెక్ట్‌ అయ్యేవని తెలిపింది. ఆ తర్వాత 2004లో ఎలాగోలా మొదటి ఫ్రీలాన్స్‌ ప్రాజెక్ట్‌ దొరికిందని, దాని కోసం ఏడు నుంచి ఎనిమిది వీడియోలు రూపొందించడంతో రూ. 10 వేలు చెల్లించినట్లు వెల్లడించింది. ఆ తర్వాత తాను దీంట్లోనే పూర్తి స్థాయిలో కొనసాగాలనే ఉద్దేశ్యంతో స్థిరమైన న్యాయవాద ఉద్యోగాన్ని వదిలేసినట్లు పేర్కొన్నారు