లెనిన్’లో అఖిల్ తో పోటీపడి నటించిన ఇతడి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?... సలార్’లోనూ మెరిశాడు
Actor ProfileActor

లెనిన్’లో అఖిల్ తో పోటీపడి నటించిన ఇతడి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?... సలార్’లోనూ మెరిశాడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లెనిన్’లో అఖిల్ తో పోటీపడి నటించిన ఇతడి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?... సలార్’లోనూ మెరిశాడు
Samayam Telugu1 Nov 2026
లెనిన్’లో అఖిల్ తో పోటీపడి నటించిన ఇతడి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?... సలార్’లోనూ మెరిశాడు

అక్కినేని అఖిల్ మాస్ కంబ్యాక్ మూవీ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు మలిచిన ఈ పల్లెటూరి యాక్షన్ డ్రామాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే గ్లామర్, సీనియర్ నటులు శివాజీ, ఈశ్వరీ రావుల పర్ఫార్మెన్స్ చిత్ర విజయానికి ప్లస్ అయ్యాయి. అయితే, వీరితో పాటు కథను మలుపు తిప్పే ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించిన ఒక నటుడు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. అతడే.. చిత్రంలో అఖిల్ ప్రాణ స్నేహితుడు 'వసంత్' పాత్రలో కనిపించిన ప్రమోద్ పంజు .* బాక్సాఫీస్ వద్ద అఖిల్'లెనిన్' సునామీ: రెండ్రోజుల్లో రూ.37.2 కోట్ల కలెక్షన్స్ ప్రీ క్లైమాక్స్ జాతరలో ఊచకోత పెర్ఫార్మెన్స్'లెనిన్' సినిమాలో వసంత్ పాత్ర కథాగమనాన్ని మార్చడంలో అత్యంత కీలకంగా నిలుస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో వచ్చే ఊహించని ట్విస్టులు, ప్రీ క్లైమాక్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే జాతర ఎపిసోడ్‌లో ప్రమోద్ పంజు చూపించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. యాక్షన్ సన్నివేశాల్లోనూ, భావోద్వేగాలు పండించడంలోనూ ఆయన కనబరిచిన ఈజ్ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు అందుకుంటోంది. జాతర సీన్‌లో ప్రమోద్ పంజు తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఏకంగా అఖిల్‌కు గట్టి పోటీ ఇచ్చాడని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. తాజాగా జరిగిన సినిమా సక్సెస్ మీట్‌లో సూపర్ స్టార్ అక్కినేని నాగార్జున సైతం ప్రమోద్ పంజు నటనను ప్రత్యేకంగా అభినందించడంతో, ఇంతకీ ఈ టాలెంటెడ్ నటుడు ఎవరు? దీనికి ముందు ఎలాంటి సినిమాలు చేశాడనే దానిపై నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.* నేను పుట్టాక నాన్న ఉద్యోగం పోయింది.. నైజీరియాలో ఎన్నో అవమానాలు పడ్డా – భాగ్యశ్రీ బోర్సే'సలార్' లోని కీలక పాత్రనిజానికి ప్రమోద్ పంజు కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు. కెరీర్ ఆరంభంలో బుల్లితెర సీరియల్స్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న ఆయన, ఆ తర్వాత వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడ్డారు

ల న న ల అఖ ల త ప ట పడ నట చ న ఇతడ బ య క గ ర డ త ల స సల ర ల న మ ర శ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in