లెనిన్’ మూవీ రివ్యూ.. అయ్యగారు హిట్ కొట్టినట్టేనా
Actor ProfileActor

లెనిన్’ మూవీ రివ్యూ.. అయ్యగారు హిట్ కొట్టినట్టేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లెనిన్’ మూవీ రివ్యూ.. అయ్యగారు హిట్ కొట్టినట్టేనా
Zee Telugu21 Oct 2026
లెనిన్’ మూవీ రివ్యూ.. అయ్యగారు హిట్ కొట్టినట్టేనా

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. మూవీ రివ్యూ: లెనిన్ (Lenin) నటీనటులు: అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే, ప్రమోద్ పంజు, బ్రహ్మాజీ, ఈశ్వరి బాయి తదితరులు సంగీతం: ఎస్.ఎస్.థమన్ సినిమాటోగ్రఫీ: లియోన్ బ్రిట్లో ఎడిటర్: నవీన్ నూలి బ్యానర్స్: మనం ఎంటర్టైన్మెంట్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగవంశీ కథ, దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరి విడుదల తేది: 10-7-2026 అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ 11 యేళ్ల కావొస్తోన్న ఇప్పటికీ వేళ్ల మీద లెక్కపెట్టే సినిమాలే చేశాడు. అంతేకాదు వచ్చిన సినిమాలు వచ్చినట్టే బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఈ నేపథ్యంలో అఖిల్ పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నటించిన సినిమా ‘లెనిన్’. ఈ రోజు విడుదలైన ఈ సినిమాతో అక్కినేని నట వారసుడు పవర్‌ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం. ‘లెనిన్’ కథ విషయానికొస్తే.. 2001లో కడప జైలు నుంచి విడుదలైన లెనిన్ (అఖిల్ అక్కినేని) తన ఊరు శ్రీరామాపురం వెళతాడు. చిన్నపుడే అనాథగా ఆ ఊరు వచ్చిన ‘లెనిన్’ అక్కడ ఊరు పెద్ద (ఈశ్వరి బాయి) చేరదీస్తోంది. వాళ్ల ఇంట్లో వారి కుమారుడు వసంత్ (ప్రమోద్ పంజు)తో కలిసి పెరుగుతాడు. ఈ క్రమంలో ఊరి తిరునాళ్లలో భారతి(భాగ్యశ్రీ బోర్సే)ని చూసి ప్రేమిస్తాడు లెనిన్. మరోవైపు తనను పెంచి పెద్ద చేసిన వసంత్ తో భారతి అక్కకు ఇచ్చి పెద్దలు పెళ్లి నిశ్చయిస్తారు. ఆమె పెళ్లి రోజు రాత్రి