
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `లెనిన్`. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలతో ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. కథగా కొంత రెగ్యూలర్ కమర్షియల్ మూవీగా ఉందనే కామెంట్ ఉన్నా, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్స్ మాస్ ఆడియెన్స్ కి బాగానే కనెక్ట్ అవుతుందనే టాక్ ఉంది. `లెనిన్` మూవీ బాక్సాఫీసు వద్ద మాత్రం మంచి ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. అఖిల్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ ని సాధించడం విశేషం. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.9.73కోట్లు(సాక్నిల్క్ సైట్ లెక్కల ప్రకారం) వసూలు చేసింది. ఇండియాలో రూ.6.73కోట్ల గ్రాస్, రూ.5.90కోట్ల నెట్ రాబట్టింది. ఎవర్సీస్‌లో అదిరిపోయే వసూళ్లని కలెక్ట్ చేసింది. అక్కడ దీనికి ఏకంగా రూ.3కోట్లు వచ్చాయి. మొత్తంగా మొదటి రోజు అఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది `లెనిన్`. అఖిల్ నటించిన గత చిత్రం `ఏజెంట్` మొదటి రోజు సుమారు ఏడు కోట్లు రాబట్టింది. దాన్ని `లెనిన్` బ్రేక్ చేసింది. ఇది ఈ మూవీ పాజిటివ్ టాక్ కి ఒక సాంకేతం, మూవీ విజయానికి ఒక సాంకేతంగా నిలిచిందని చెప్పొచ్చు. అయితే ఇదే జోరు శనివారం, ఆదివారం కూడా చూపిస్తుందా అనేది చూడాలి. ఇప్పటి వరకు బుకింగ్స్ పరంగా సాలిడ్‌గానే ఉంది. ఈ రెండు రోజులు వసూళ్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి వచ్చే ఆదరణ బట్టి ఈ మూవీ విజయం ఆధారపడి ఉంటుంది. `లెనిన్` సినిమాకి అయిన బడ్జెట్ సుమారు రూ.40కోట్లు అని సమాచారం. నాన్ థియేట్రికల్ రైట్స్.. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ జీ తెలుగు వాళ్లు తీసుకున్నారు. దీని రూపంలో దాదాపు 30శాతం రికవరీ అయ్యిందట