లెనిన్ నుంచి అందుకే తప్పుకుందంట!
Actor ProfileActor

లెనిన్ నుంచి అందుకే తప్పుకుందంట!

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లెనిన్ నుంచి అందుకే తప్పుకుందంట! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema14 Oct 2026
లెనిన్ నుంచి అందుకే తప్పుకుందంట! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన “లెనిన్” (Lenin) రేపు (జులై 10) విడుదల కానుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ నటించింది. కానీ భాగ్యశ్రీ కన్నా ముందు శ్రీలీల (Sreeleela) ఈ సినిమాలో హీరోయిన్. ఆమెపై కొన్ని సన్నివేశాలు కూడా తీశారు. అప్పట్లో రిలీజ్ చేసిన గ్లింప్స్ లో కూడా అఖిల్ చేయి పట్టుకొని శ్రీలీల కనిపించింది. ఆ తర్వాత ఇంకొన్ని రోజులు షూటింగ్ కూడా నడిచింది. ఆ తర్వాత ఏమైందో ఏమో, అంతలోనే ఈ ప్రాజెక్టు నుంచి శ్రీలీల తప్పుకుంది. అప్పట్లో ఈ వ్యవహారంపై చాలా పుకార్లు వచ్చాయి. ఆమె ఈ పాత్రను సరిగ్గా చేయట్లేదంటూ కొన్ని పుకార్లు వచ్చాయి. ఆమెది ఐరెన్ లెగ్ అని, అందుకే తప్పించారంటూ ఇంకొంతమంది అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తాజాగా నిర్మాత నాగవంశీ స్పందించాడు. “ఈ సినిమాకు అన్నీ మంచి విషయాలే జరుగుతున్నాయి, కొంతమంది తప్పుకున్నారు” అంటూ ఓ పాత్రికేయుడు స్పందిస్తే, “అంటే.. మీరు శ్రీలీల బ్యాడ్ అని అంటున్నారా” అంటూ నేరుగానే ప్రశ్నించాడు నాగవంశీ. చాలామంది అనుకుంటున్నట్టు శ్రీలీల బ్యాడ్ కాదని, కేవలం డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లనే ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుందని వివరణ ఇచ్చాడు. అయితే నాగవంశీ వివరణ పెద్దగా ఎవ్వర్నీ ఆకర్షించలేదు. అసలు కారణం ఏంటనేది బహిరంగ రహస్యం

ల న న న చ అ ద క తప ప క ద ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in