లెనిన్’ డైరెక్టర్ తో మాస్ మహారాజా.. రవితేజ నెక్ట్స్ మూవీ
Actor ProfileActor

లెనిన్’ డైరెక్టర్ తో మాస్ మహారాజా.. రవితేజ నెక్ట్స్ మూవీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లెనిన్’ డైరెక్టర్ తో మాస్ మహారాజా.. రవితేజ నెక్ట్స్ మూవీ
Chitrajyothy26 Nov 2026
లెనిన్’ డైరెక్టర్ తో మాస్ మహారాజా.. రవితేజ నెక్ట్స్ మూవీ

‘లెనిన్’తో అఖిల్ కు హిట్టొచ్చింది. ఈ సినిమా సక్సెస్‌తో అక్కినేని అభిమానుల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. దర్శకుడు మురళీ కిషోర్‌ అబ్బూరుకు కూడా కాస్త డిమాండ్‌ పెరిగింది. ‘లెనిన్’తో అఖిల్ కు హిట్టొచ్చింది. ఈ సినిమా సక్సెస్‌తో అక్కినేని అభిమానుల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. దర్శకుడు మురళీ కిషోర్‌ అబ్బూరుకు (murali kishor abburu) కూడా కాస్త డిమాండ్‌ పెరిగింది. తదుపరి ప్రాజెక్ట్‌ గురించి ఆసక్తి నెలకొంది. మురళీ కిషోర్‌.. మాస్‌ మహారాజా రవితేజతో (Raviteja) సినిమా చేయనున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. మూడేళ్ల క్రితమే మురళీ కిషోర్‌ ఓ కథను రవితేజకు వినిపించారట. కథ నచ్చినప్పటికీ.. రవితేజ సినిమాల నుంచి అభిమానులు ఆశించే స్థాయి మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆ కథలో తక్కువైందని భావించి అప్పట్లో ఆయన ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టారట. అయితే దర్శకుడి టేకింగ్‌, కథ చెప్పే విధానం రవితేజకు నచ్చడంతో అప్పటి నుంచే మురళీ కిషోర్‌పై మంచి అభిప్రాయం ఏర్పడినట్లు సమాచారం. ఇప్పుడు ‘లెనిన్’ విజయం ఆ నమ్మకాన్ని మరింత పెంచిందని టాక్‌. దీంతో ఈసారి ఎలాగైనా మురళీ కిషోర్‌తో కలిసి పనిచేయాలని రవితేజ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇద్దరి మధ్య కథకు సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించే అవకాశముందని టాక్‌. అయితే రవితేజ చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి. ఆయన నటించిన ‘ఇరుముడి’ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు దర్శకుడు వివేక్‌ ఆత్రేయ, అశిత్‌ గోలీ, రవితేజ కోసం కథలు సిద్ధం చేసినట్లు సమాచారం. దర్శకుడు మారుతి కూడా రవితేజతో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ బిజీ షెడ్యూల్లో రవితేజ–మురళీ కిషోర్‌ సినిమా వెంటనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేకపోయినా.. ఈ కాంబినేషన్‌ మాత్రం దాదాపు ఖరారైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. రవితేజ తన ప్రస్తుత కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసిన

ల న న డ ర క టర త మ స మహ ర జ రవ త జ న క ట స మ వ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in