లోదుస్తులతో కారుకు వేలాడదీసి.. రేణుకాస్వామి హత్య కేసులో కీలక విషయాలు వెల్లడి
Actor ProfileActor

లోదుస్తులతో కారుకు వేలాడదీసి.. రేణుకాస్వామి హత్య కేసులో కీలక విషయాలు వెల్లడి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లోదుస్తులతో కారుకు వేలాడదీసి.. రేణుకాస్వామి హత్య కేసులో కీలక విషయాలు వెల్లడి
Eenadu24 Nov 2026
లోదుస్తులతో కారుకు వేలాడదీసి.. రేణుకాస్వామి హత్య కేసులో కీలక విషయాలు వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్: రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 14వ నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్ (Darshan) అనుచరుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారి సంచలన విషయాలు బయటపెట్టారు. ఘటన జరిగిన రోజు నుంచి సాక్ష్యాలను తారుమారు చేసే వరకు జరిగిన ప్రతీ అంశాన్నీ ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రదోష్‌ పిటిషన్‌ ప్రకారం.. ‘‘పవిత్ర గౌడకు సందేశాలు పంపిన విషయంలో రేణుకాస్వామిని దర్శన్‌ నిలదీశారు. ఆ సమయంలో ఆయన తీవ్ర పదజాలంతో దూషిస్తూ దాడికి దిగారు. దాడి తీవ్రతకు రేణుకాస్వామి తల నుంచి రక్తం కారడం నేను చూశాను. ఆ ప్రాంతానికి పవిత్ర గౌడను పిలిపించి ఆమె చెప్పుతో కొట్టేలా చేశారు. ఆ తర్వాత కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. లోదుస్తులు మాత్రమే ఉంచి టాటా ఏస్‌కు వేలాడదీసి.. నైలాన్‌ తాడుతో కొట్టారు’’ అని ప్రదోష్‌ తెలిపారు (Renukaswamy murder case). ‘‘ఇంత దారుణంగా దాడి చేస్తే రేణుకాస్వామి చనిపోతాడని నేను వారించాను. అయినా నా మాటలు ఎవరూ పట్టించుకోలేదు. అతడికి ఆహారం, నీళ్లు ఇచ్చిన తర్వాత కూడా దర్శన్‌ అతడి ఛాతీ, మెడపై కాలితో గట్టిగా తన్నారు. దాంతో రేణుకాస్వామి స్పృహతప్పి కిందపడిపోయారు. ఆ వెంటనే దర్శన్‌ తన రెండు కాళ్లతో బాధితుడి ఛాతీపై నిలబడి తొక్కేందుకు యత్నించగా.. నేను జోక్యం చేసుకుని ఆయన్ను పక్కకు లాగాను. రేణుకాస్వామి చనిపోయినట్లు గుర్తించిన తర్వాత, ఈ విషయాన్ని సద్దుమణిగేలా చేయకపోతే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని దర్శన్‌ నన్ను బెదిరించారు. దాంతో అసలు విషయాన్ని దాచిపెట్టి కల్పిత కథను సృష్టించడానికి చర్చలు జరిగాయి’’ అని ప్రదోష్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి తనకు తెలిసిన పూర్తి వివరాలు తెలిపానని.. తన రక్షణ కోసం జైలులో ఇతర నిందితులతో కాకుండా తనను ప్రత్యేక సెల్‌లో ఉంచాలని ప్రదోష్‌ విజ్ఞప్తి చేశారు. న్యాయస్థానం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి తుది తీర్పు

ల ద స త లత క ర క వ ల డద స ర ణ క స వ మ హత య క స ల క లక వ షయ ల వ ల లడ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in