లోకేష్ రాజీనామా డిమాండ్
Actor ProfilePolitician

లోకేష్ రాజీనామా డిమాండ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లోకేష్ రాజీనామా డిమాండ్ పై వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్
TeluguOne28 Nov 2026
లోకేష్ రాజీనామా డిమాండ్ పై వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్

రాష్ట్రంలోని రైతులకు శాశ్వత భూ హక్కు కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో సోమవారం (ఆగస్టు 10) నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం పాల్గొని వైసీపీ వైఖరిపైవిమర్శలు గుప్పించారు. నెలనెలా స్వయంగా ప్రజల వద్దకు వచ్చి భూ హక్కు పత్రాలు అందిస్తున్నామన్న చంద్రబాబు జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు. క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత, కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు. గతంలో నేతల ఫోటోలతో పాసు పుస్తకాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని, తమ ప్రభుత్వంలో నిజమైన యజమానులకే పూర్తి హక్కులు కల్పిస్తున్నామన్నారు. ఆక్వా రంగానికి ఊరటనిస్తూ, పది ఎకరాల పరిమితి, జోన్ నాన్ జోన్ నిబంధనలను ఎత్తివేసి 1.50 కేనామలకే విద్యుత్ సరఫరా చేసే ప్రకటనపై చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వంపై ప్రతిఏటా రూ.1,150 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ, రైతులకు ఆర్థిక భద్రత కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యమన్నారు. అలాగే కొల్లేరు ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కైకలూరుకు 36 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన డీఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను కొట్టి పారేశారు. నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ఆ పార్టీ చేస్తున్న డిమాండ్ ను ఖండించారు. ఏళ్ల తరబడి నిరుద్యోగులు ఎదురుచూసిన మెగా డీఎస్సీని సమర్థవంతంగా నిర్వహించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తే.. కోర్టు కేసులతో అడ్డుపడాలని చూశారని విమర్శించారు. నిరుద్యోగుల భవిష్యత్తును దెబ్బతీసేలా ప్రవర్తించిన వారే ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత పాలనలో రాష్ట్రంలో అరాచకాలు, గంజాయి సంస్కృతి, రౌడీయిజం రాజ్యమేలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారుల