
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Mukhyamantri Kanya Utthan Yojana : బీహార్ లోని గ్రాడ్యుయేట్ విద్యార్థినులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ముఖ్యమంత్రి కన్యా ఉత్థాన్ యోజన స్కీమ్ కింద సుమారు 1.5లక్షల మంది విద్యార్థినుల బ్యాంకు అకౌంట్లో ఒక్కొక్కరికి రూ. 50, 000 చొప్పున ప్రోత్సాహకాలను జమ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయంపై ఉన్నత విద్యాశాఖ, ఆర్థిక శాఖకు ఒక ప్రతిపాదనను సమర్పించింది. ఉన్న విద్యాశాఖ తెలిపిన సమాచారం ప్రకారం డిసెంబర్ 2025 వరకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థినుల డేటా పోర్టల్లో అప్ లోడ్ చేసి దాని ధ్రువీకరణ పూర్తి చేశారు. ధ్రువీకరణ తర్వాత అర్హులైన మహిళా విద్యార్థులకు ప్రయోజనాలు అందించే ప్రక్రియ వేగవంతం చేసింది. ఇప్పుడు ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించిన తర్వాత నిధులు నేరుగా లబ్దిదారుల బ్యాంకు అకౌంట్స్ ట్రాన్స్ ఫర్ చేస్తారు. శాఖాపరమైన విచారణలో కొంతమంది విద్యార్థినులు దరఖాస్తులు, డేటాలో సాంకేతిక లోపాలను గుర్తించారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు అర్హులైన ఏ విద్యార్థిని కూడా ఈ స్కీమ్ బెనిఫిట్స్ కు దూరం కాకుండా ఉండేందుకు సంబంధిత విశ్వవిద్యాలయాలు ఆన్ లైన్ లో దిద్దుబాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ స్కీమ్ కింద గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున ఇచ్చేందుకు నిబంధన ఉందని ఉన్నత విద్యాశాఖ తెలిపింది. సంబంధిత శాఖ ఈ మొత్తం చెల్లింపు ప్రక్రియను ఖరారు చేయడంలో నిమగ్నమై ఉందని.. త్వరలోనే ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ స్కీమ్ కోసం.. రాష్ట్రంలోని బీఎన్ మండల్ విశ్వవిద్యాలయం, బీఆర్ఏ బీహార్ విశ్వవిద్యాలయం, జైప్రకాష్