
20 Lakh Jobs in AP: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, యువతకు ఉద్యోగాలు, పెట్టుబడులు, సామాజిక న్యాయం, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలపై కీలక ప్రకటనలు చేశారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సాయం అందేలా, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలతో పాటు చెప్పని అనేక కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచి పేదలకు ఆర్థిక భద్రత కల్పించామని తెలిపారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి బిడ్డ చదువుకోవాలనే ఉద్దేశంతో ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ సాయాన్ని ఖర్చుగా కాకుండా పిల్లల భవిష్యత్‌పై పెట్టుబడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు అండగా ‘స్త్రీశక్తి’ మహిళల ఆర్థిక భారం తగ్గించేందుకు ‘స్త్రీశక్తి’ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఏడాది క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం ఉద్యోగాలకు వెళ్లే మహిళలు, పనులకు వెళ్లేవారు, ఆసుపత్రులు, మార్కెట్లు, దేవాలయాలకు వెళ్లే మహిళలకు ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. ‘దీపం-2’ ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని, ఆటో డ్రైవర్లకు ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమం ద్వారా అండగా నిలుస్తున్నామని చెప్పారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీర్చడంతో పాటు వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామని, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లను విస్తరిస్తున్నామని తెలిపారు. పీ4తో ఆర్థిక అసమానతలకు చెక్ సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గినప్పుడే మెరుగైన జీవన ప్రమాణాలు, నిజమైన ప్రగతి సాధ్యమని చంద్రబాబు అన్నారు. అందుకే ‘పీ4’ కార్యక్రమాన్ని ‘ఎంబికె 10-20’ విధానంతో ప్రారంభించామని చెప్పారు. సమాజంలోని ఉన్నత స్థాయిలో ఉన్న 10 శాతం మంది అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాలకు చేయూతనిచ్చేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని వివరించారు. లక్షలాది ‘బంగారు కుటుంబాలను’ మార్గదర్శులు దత్తత తీసుకుని