
ఈ రోజు 'రాకింగ్ స్టార్' యశ్ అంటే దేశవ్యాప్తంగా తెలుసు. కానీ ఆయన ప్రయాణం పూలపాన్పు కాదు. నటుడు కావాలనే కలతో 16 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి వచ్చేశాడు. అప్పుడు ఆయన దగ్గర కేవలం ₹300 మాత్రమే ఉన్నాయని సమాచారం. సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తూ, ఖర్చుల కోసం చిన్న చిన్న పనులు కూడా చేశాడు. రోజుకు సుమారు ₹50 సంపాదిస్తూ, నటనలో శిక్షణ తీసుకున్నాడు. 2004లో 'ఉత్తరాయణ' అనే కన్నడ టీవీ సీరియల్‌తో ఆయన నటన ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత నాటకాల్లోనూ నటించాడు. 2007లో 'జంబద హుడుగి' సినిమాలో యశ్ సహాయ నటుడిగా పరిచయమయ్యాడు. ఆ మరుసటి ఏడాదే 'రాకీ' సినిమాతో హీరోగా మారాడు. 'మొగ్గిన మనసు', 'గూగ్లీ' వంటి చిత్రాలు ఆయనకు మంచి అభిమానులను ఏర్పర్చాయి. అయితే 2018లో వచ్చిన 'KGF: చాప్టర్ 1' ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్. 'రాకీ భాయ్' పాత్ర ఆయన్ను కన్నడ ప్రేక్షకులను దాటి పాన్-ఇండియా స్టార్‌ను చేసింది. 2022లో వచ్చిన 'KGF: చాప్టర్ 2' విజయంతో ఆయన మార్కెట్ మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ₹200 కోట్లు దాటిన తొలి కన్నడ చిత్రంగా 'KGF: చాప్టర్ 1' రికార్డు సృష్టించింది. కేజీఎఫ్ 2 సుమారు రూ.1200కోట్లు రాబట్టిన విషయం తెలిసిందే. యశ్, ఆయన భార్య రాధికా పండిట్ కలిసి 'యశోమార్గ ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. ఈ సంస్థ గ్రామీణాభివృద్ధి, నీటి సంరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి పెడుతుంది. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో నీటి సమస్యను పరిష్కరించేందుకు, ఈ ఫౌండేషన్ చెరువుల పూడికతీత పనులు చేపట్టిందని సమాచారం. 2020లో కరోనా సమయంలో సినీ పరిశ్రమకు చెందిన 3,000 మంది కార్మికులకు తలా ₹5,000 చొప్పున సహాయం చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అందుకే యశ్ కథ కేవలం '₹300 నుంచి ₹53 కోట్లు' సంపాదించడం మాత్రమే కాదు, సినిమా