ర ష్మిక వ ల్ల సినిమాలు వాయిదా ప డ తాయా
Actor ProfileActor

ర ష్మిక వ ల్ల సినిమాలు వాయిదా ప డ తాయా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ర ష్మిక వ ల్ల సినిమాలు వాయిదా ప డ తాయా
Telugu Times26 Dec 2026
ర ష్మిక వ ల్ల సినిమాలు వాయిదా ప డ తాయా

రష్మిక మందన్న(Rashmika Mandanna) ఇటీవల సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడడంతో ప్రస్తుతం కొన్ని వారాలు రెస్ట్ తీసుకోవాలని డాక్ట‌ర్లు సూచించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ(vijay devarakonda) హీరోగా రాహుల్ సంకృత్యాన్(Rahul Sakrityan) దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి(Ranabaali) చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే రష్మిక గాయం కారణంగా ఆమె పాల్గొనాల్సిన సీన్స్ వాయిదా పడటంతో సినిమా రిలీజ్ షెడ్యూల్‌పై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. మొదట సెప్టెంబర్ రిలీజ్‌ ను టార్గెట్ గా పెట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్‌లో రిలీజ‌య్యే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. రష్మిక కోలుకున్న వెంటనే రణబాలికి ప్రాధాన్యత ఇచ్చి తన డేట్స్ ను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న రాకా(Raaka) సినిమా షూటింగ్ కూడా ఆమె అందుబాటులో లేకపోవడంతో మార్పులకు లోనైంది. ప్రస్తుతం రష్మిక అవసరం లేని సీన్స్ ను షూట్ చేస్తున్న యూనిట్, మిగిలిన షెడ్యూల్‌లను తిరిగి ప్రణాళిక చేస్తున్నట్లు సమాచారం. ముంబైలో జరుగుతున్న ప్రస్తుత షెడ్యూల్ తర్వాత రష్మిక నవంబర్‌లో తిరిగి సెట్స్‌లో చేరే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మైసా(Mysaa) సినిమా షూటింగ్ కూడా ఈ గాయం కారణంగా ఆలస్యమైంది. హై ఎనర్జీ డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ టైమ్ లో ఆమెకు హిప్ టెండన్ డిటాచ్‌మెంట్ గాయం అయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా రిలీజ్ ప్లాన్స్ కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మొత్తంగా రష్మిక గాయం ప్రస్తుతం మూడు ప్రధాన చిత్రాల షూటింగ్, షెడ్యూల్స్, రిలీజ్ డేట్స్ పై ప్రభావం చూపినట్లు సినీ వర్గాల్లో డిస్క‌ష‌న్ జరుగుతోంది. ఆమె త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌లలో పాల్గొనాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు

ర ష మ క వ ల ల స న మ ల వ య ద ప డ త య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in