రేవంత్ ఇల్లు కూడా 22ఏలో
Actor ProfilePolitician

రేవంత్ ఇల్లు కూడా 22ఏలో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రేవంత్ ఇల్లు కూడా 22ఏలో
Andhra Jyothy6 Jan 2027
రేవంత్ ఇల్లు కూడా 22ఏలో

ఆయనకు సెగ తగలగానే హడావుడి ముఖ్యమంత్రికి చురుకు తగిల్తేగానీ సామాన్యుల బాధలు పట్టవా? 22ఏను.. ప్రజల్ని దోచుకునే ఆయుధంగా మార్చుకున్నారు: హరీశ్‌రావు ఆగ్రహం హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘భూములను అడ్డగోలుగా 22ఏ జాబితాలో వేయడం.. ఆ తర్వాత దాన్ని సరిచేయడానికి జీవోలు తెస్తాం, రివ్యూలు చేస్తామని డ్రామాలు ఆడడం ఎందుకు?’’ అని సర్కారుపై బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరు ‘హంతకుడే సంతాపసభ పెట్టినట్టు’ ఉందని విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించిన ఆయన ఏకంగా ఎయిర్‌పోర్ట్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డు లాంటి ప్రభుత్వ భూములను కూడా 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారంటే ఈ అధికారుల పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నగరంలో లక్షలాది ప్రాపర్టీలను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో చేర్చారని.. చివరకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇల్లు కూడా 22ఏ ప్రొహిబిషన్‌ లిస్ట్‌లో ఉందంటే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. సీఎం ఇంటికి సెగ తగిలేసరికి ప్రభుత్వంలో హడావుడి మొదలైందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్‌.. నీకు చురుకు తగిలితే కానీ సామాన్యుల బాధలు పట్టవా?’’ అని ప్రశ్నించారు. స్వయంగా ముఖ్యమంత్రి పరిస్థితే ఇలా ఉంటే, ఇక రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ల గోడు ఎవరు వినాలని నిలదీశారు. ఎవరి భూమి 22ఏలో ఉందో, ఎవరిది లేదో తెలియక రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పు జరిగినపుడు తక్షణమే ఆ భూములను 22ఏ నుంచి తొలగించకుండా రివ్యూల పేరుతో కాలయాపన చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. 22ఏ అనేది ఈ ప్రభుత్వానికి ప్రజలను అడ్డగోలుగా దోచుకునే ఒక ఆయుధంగా మారిందని.. రెవెన్యూశాఖలో ఏ పని కావాలన్నా, 22ఏ నుంచి భూమిని బయటకు తీయాలన్నా 30 శాతం కమీషన్‌ ఇవ్వాలనేది అందరికీ తెలిసిన బహిరంగ

ర వ త ఇల ల క డ 22ఏల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in