
Eenadu•4 Dec 2026
రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సేవలో రోబో.. ఏం చేస్తుందంటేఒడిశా రాజధాని భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో సరికొత్త సెక్యూరిటీ గార్డ్ సేవలు అందిస్తున్నారు. ఆ గార్డ్‌ను చూసి ప్రయాణికులు వావ్ అంటున్నారు. అదెవరో కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పని చేసే ‘డీఎస్సీ అర్జున్’ అనే రోబో. ప్రయాణికుల భద్రత కోసం ఈ రోబోను ప్రవేశపెట్టారు. 360 డిగ్రీల కెమెరా ఉన్న ఈ రోబో స్టేషన్‌లోకి వచ్చే ప్రతి ఒక్కరినీ స్కాన్ చేస్తుంది. ఎంత మంది వచ్చారో లెక్కిస్తుంది. అలాగే అనుమానాస్పద వ్యక్తులను, సామన్లను గుర్తిస్తుంది. అగ్నిప్రమాదాలు జరిగితే సంబంధిత సమాచారం అధికారులకు తెలియజేస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా ప్రకటనలు జారీ చేయడం, ప్రయాణికులను అప్రమత్తం చేయడం వంటి పనులూ ఈ రోబో చేయగలదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ వార్త చదివారా: కేంద్ర హోం మంత్రి ఈ రోజు కూడా లోక్‌సభకు హాజరు కాలేదు..: కాంగ్రెస్