రైల్వే స్టేషన్లలో కలుషిత నీరు.. కాగ్ నివేదికతో రంగంలోకి దిగిన కేంద్రం
Actor ProfilePolitician

రైల్వే స్టేషన్లలో కలుషిత నీరు.. కాగ్ నివేదికతో రంగంలోకి దిగిన కేంద్రం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రైల్వే స్టేషన్లలో కలుషిత నీరు.. కాగ్ నివేదికతో రంగంలోకి దిగిన కేంద్రం
AP7AM1 Jan 2027
రైల్వే స్టేషన్లలో కలుషిత నీరు.. కాగ్ నివేదికతో రంగంలోకి దిగిన కేంద్రం

దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అందిస్తున్న తాగునీరు సురక్షితం కాదని, ప్రమాదకర బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక హెచ్చరించడంతో రైల్వే మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నేతృత్వంలో సీనియర్ అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం, స్టేషన్లలో సురక్షితమైన తాగునీటిని అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని రైల్వే బోర్డును ఆదేశించారు.ఈ సమస్యను అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తూ, రైల్వే బోర్డు స్థాయిలో నేరుగా పర్యవేక్షించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌లోని 20,000 ప్రదేశాలలో వాటర్ కూలర్లతో పాటు సమగ్ర ఫిల్టరేషన్, పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. స్టేషన్లలో "ట్యాంక్ టూ ట్యాప్" వాటర్ ఫిల్టరేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని, పాత నీటి ట్యాంకులను వెంటనే మార్చాలని ఆదేశించారు. నీటి నాణ్యత పరీక్షల నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, దీనిపై జవాబుదారీతనాన్ని స్పష్టంగా నిర్ధారించాలని సూచించారు. నీటి నాణ్యతకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచి పారదర్శకత పాటించాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు.కాగ్ నివేదికలో కీలక అంశాలుదేశంలోని అన్ని జోన్ల పరిధిలో 512 నాన్-సబర్బన్ గ్రేడ్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సేవలను కాగ్ అంచనా వేసింది. ఈ తనిఖీల్లో భాగంగా నాలుగు జోన్ల పరిధిలోని ఎనిమిది స్టేషన్లలోని వాటర్ కూలర్ల నుంచి సేకరించిన నీటి నమూనాలలో 'ఇ కొలి (E. coli)' బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్ర ఆరోగ్య