రైలులో హీరోయిన్ హల్చల్.. బట్టలు విప్పేసి బ్లేడుతో దాడి
Actor ProfileActor

రైలులో హీరోయిన్ హల్చల్.. బట్టలు విప్పేసి బ్లేడుతో దాడి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రైలులో హీరోయిన్ హల్చల్.. బట్టలు విప్పేసి బ్లేడుతో దాడి
Chitrajyothy1 Jan 2027
రైలులో హీరోయిన్ హల్చల్.. బట్టలు విప్పేసి బ్లేడుతో దాడి

హిందీ టెలివిజన్ నటి, మోడల్ అంతరా బెనర్జీ (31) ఆరావళి ఎక్స్‌ప్రెస్ రైలులో అసభ్యంగా ప్రవర్తించి హల్‌చల్ చేసింది. అంబోలికి చెందిన ఈమె షూటింగ్ నిమిత్తం సూరత్ వెళ్లేందుకు స్లీపర్ క్లాస్ టికెట్‌తో రైలు ఎక్కింది. హిందీ టెలివిజన్ నటి, మోడల్ అంతరా బెనర్జీ (Antara Banerjee) (31) ఆరావళి ఎక్స్‌ప్రెస్ రైలులో అసభ్యంగా ప్రవర్తించి హల్‌చల్ చేసింది. అంబోలికి చెందిన ఈమె షూటింగ్ నిమిత్తం సూరత్ వెళ్లేందుకు స్లీపర్ క్లాస్ టికెట్‌తో రైలు ఎక్కింది. అయితే బోరివలి వద్ద రైలు ఎక్కిన వెంటనే ఆమె రిజర్వ్‌డ్ ఏసీ కోచ్‌లోకి వెళ్లి వేరొకరి సీటులో కూర్చుంది. ఆ సీటుకు చెందిన ప్రయాణికుడు ఖాళీ చేయాలని కోరగా, ఆమె నిరాకరించి గొడవకు దిగింది. దీంతో ప్రయాణికుడు టికెట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులను ఆశ్రయించాడు. పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చిన ఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ యామినిక్రాంత్ మిశ్రా, కాన్స్టేబుల్ రాజేష్ కుమార్‌లపై అంతరా బెనర్జీ తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. అధికారుల కథనం ప్రకారం.. గొడవ పెరిగి పెద్దదవడంతో ఆమె తన దుస్తులు తొలగించి, తన వద్ద ఉన్న రేజర్ బ్లేడ్‌తో ఆర్‌పీఎఫ్ అధికారి మిశ్రాపై దాడి చేసింది. ఈ దాడిలో అధికారికి తీవ్ర గాయాలు కాగా, ఆమె తనను తాను కూడా గాయపరచుకుంది. అంతేకాకుండా అధికారి యూనిఫాం, మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేసి, ఏసీ కోచ్ అద్దాలను పగలగొట్టి పారిపోయేందుకు ప్రయత్నించింది. సుమారు గంటకు పైగా సాగిన ఈ తీవ్ర గందరగోళం మధ్య ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అనంతరం డహాణు రోడ్ రైల్వే స్టేషన్‌లో ఆమెను దింపి, గవర్నమెంట్ రైల్వే పోలీస్ కి అప్పగించారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి, ప్రాణాపాయం కలిగించడం తదితర తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి నోటీసులు జారీ చేసి ఆమెను బెయిల్‌పై విడుదల చేశారు. అంతరా

ర ల ల హ ర య న హల చల బట టల వ ప ప స బ ల డ త ద డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in