రాయలసీమ కళే మారనుంది.. ప్రపంచ డ్రోన్ సిటీగా కర్నూలు.. 600 ఎకరాల్లో
Actor ProfilePolitician

రాయలసీమ కళే మారనుంది.. ప్రపంచ డ్రోన్ సిటీగా కర్నూలు.. 600 ఎకరాల్లో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాయలసీమ కళే మారనుంది.. ప్రపంచ డ్రోన్ సిటీగా కర్నూలు.. 600 ఎకరాల్లో, రూ. 5 వేల కోట్ల పెట్టుబడి
Samayam Telugu13 Jan 2027
రాయలసీమ కళే మారనుంది.. ప్రపంచ డ్రోన్ సిటీగా కర్నూలు.. 600 ఎకరాల్లో, రూ. 5 వేల కోట్ల పెట్టుబడి

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. కర్నూలును డ్రోన్ సిటీగా అభివృద్ధి చేసేందుకు సన్నాహకాలు చేస్తోంది. కర్నూలు సమీనంలోని ఓర్వకల్లు మండలంలో 600 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని.. రాబోయే కాలంలో రూ. 5 వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. డ్రోన్ల పరిశోధన, ఆవిష్కరణ, తయారీ, పరీక్షల నిర్వహణ, ధ్రువీకరణ తదితర అన్ని విభాగాలు ఇక్కడే అందుబాటులో ఉంటాయన్నారు.డ్రోన్ సిటీలో వివిధ డ్రోన్ల కంపెనీల సీఈఓలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. దేశంలోనే ఈ డ్రోన్ సిటీ మొదటిదన్నారు. సీఈఓలు చేసిన సూచనల అధ్యయనానికి ఒక కమిటీ వేస్తామని ఆయన చెప్పారు. డ్రోన్ సంస్థలకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. READ ALSO వెలుగొండ ప్రాజెక్టు కోసం ఊళ్లే వదిలేసి వెళ్తున్నారు.. నల్లమల సాగర్‌తో 11 గ్రామాలు మునకఅమరావతిలో రెండేళ్ల కిందట డ్రోన్ సమ్మిట్ నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటికప్పుడు డ్రోన్ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. దానికి అనుగుణంగానే కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటయిందన్నారు. రాళ్లతో నిండిన ఈ ప్రాంతం రేపు డ్రోన్ల తయారీ కేంద్రంగా నిలుస్తుందన్నారు. టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి డ్రోన్ సిటీ అభివృద్ధిని సమీక్షిస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.తొలి దశలో 120 ఎకరాల్లో అభివృద్ధి చేశామని, రెండో దశలో 480 ఎకరాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఏపీఐఐసీ ఈడీ యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. డ్రోన్ల రంగాన్ని రూ. 500 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ గీతాంజలి శర్మ చెప్పారు. డ్రోన్ల తయారీ సంస్థల ప్రతినిధులు ప్రదర్శించిన డ్రోన్లను రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం

ర యలస మ కళ మ రన ద ప రప చ డ ర న స ట గ కర న ల 600 ఎకర ల ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in