రొమ్ము క్యాన్సర్ పరీక్షకు మహిళలు దూరం
Actor ProfilePolitician

రొమ్ము క్యాన్సర్ పరీక్షకు మహిళలు దూరం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రొమ్ము క్యాన్సర్ పరీక్షకు మహిళలు దూరం
Andhra Jyothy18 Nov 2026
రొమ్ము క్యాన్సర్ పరీక్షకు మహిళలు దూరం

‘క్లినికల్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌ (సీబీఈ) చేయించుకుంటే ఎక్కడ క్యాన్సర్‌ బయటపడుతుందో..! రొమ్మును తొలగిస్తారేమో..! అనే భయం చాలా మంది మహిళను ఇంకా వెంటాడుతునే ఉంది. స్క్రీనింగ్‌కు ముందుకొస్తున్నది ఒక శాతమే... గ్రామీణుల కంటే పట్టణ మహిళలు వెనకడుగు అమెరికాలోని ఎండీ ఆండర్సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌, ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ‘క్లినికల్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌ (సీబీఈ) చేయించుకుంటే ఎక్కడ క్యాన్సర్‌ బయటపడుతుందో..! రొమ్మును తొలగిస్తారేమో..! అనే భయం చాలా మంది మహిళను ఇంకా వెంటాడుతునే ఉంది. ఈ భయం వారిని క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ చేయించుకోవడానికి ముందుకు అడుగు వేయనియడం లేద’ని వైద్యులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే పట్ణణవాసులు సీబీఈ చేయించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం జాతీయస్థాయిలో రొమ్ము క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ కార్యక్రమం అమలు జరుగుతున్నప్పటికీ కేవలం ఒక శాతం మంది మహిళలే స్ర్కీనింగ్‌ చేయించుకోవడానికి ముందుకొస్తున్నారని ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ రఘురాం వివరించారు. ఈ పరిస్థితికి కారణాలను తెలుసుకునేందుకు అమెరికాలోని ఎండీ ఆండర్సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌, తమ ఫౌండేషన్‌, మరికొన్ని సంస్థల పరిశోధకులు అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఆ అధ్యయన ఫలితాలను అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ క్లినికల్‌ ఆంకాలజీ సమావేశంలో ప్రవేశపెట్టగా, అవి జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఆంకాలజీలో ప్రచురితమయ్యాయని పేర్కొన్నారు. 2025 అక్టోబరులో తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన 35 ఏళ్లు దాటిన 669 మంది మహిళలపై అధ్యయనం నిర్వహించారు. 421 మంది రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. వారిలో 81.1 శాతం మంది అదే మొదటిసారి పరీక్ష చేయించుకోవడం! ఇక 248 మంది పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించారు. దీనికి అవగాహన లోపం, భయాలు, ఇతర సామాజిక కారణాలు ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని డాక్టర్‌ రఘురాం వివరించారు. గ్రామీణ మహిళలతో పోలిస్తే పట్టణ, అధిక ఆదాయ కుటుంబాలకు చెందిన మహిళలు పరీక్షలు

ర మ మ క య న సర పర క షక మహ ళల ద ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in