రామ్ పోతినేనికి విలన్ గా మారిన ఆ స్టార్ హీరో
Actor ProfileActor

రామ్ పోతినేనికి విలన్ గా మారిన ఆ స్టార్ హీరో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రామ్ పోతినేనికి విలన్ గా మారిన ఆ స్టార్ హీరో
TeluguOne15 Jan 2027
రామ్ పోతినేనికి విలన్ గా మారిన ఆ స్టార్ హీరో

స్వయం కృషితో స్టార్ డమ్ సంపాదించాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో తన 23 వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వరుస పరాజయాల తర్వాత ఈసారి ఎలాగైనా సరే బాక్సాఫీస్ వద్ద తన జెండా పాతాలనే లక్ష్యంతో తెరకెక్కిస్తుండటంతో అభిమానులతో పాటు టాలీవుడ్ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సినిమా మేకింగ్ విషయంలో రామ్ ఎలాంటి రాజీ పడటం లేదు. ఇటీవల పుదుచ్చేరిలో జరిగిన షెడ్యూల్‌లో ఏకంగా 24 గంటల పాటు విరామం లేకుండా నాన్‌స్టాప్‌గా కీలక సన్నివేశాలను చిత్రీకరించి ఇండస్ట్రీ వర్గాలని ఆశ్చర్యపరిచాడు. భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం చిత్రీకరణకు చిన్న విరామం లభించింది. అయితే ఈ గ్యాప్‌లోనే చిత్ర యూనిట్ సినిమాలోని అత్యంత కీలకమైన విలన్ పాత్ర ఎంపికపై దృష్టి సారించింది. హీరో పాత్రకు సరిసమానమైన పవర్ ఫుల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ రోల్ కోసం మొదట కోలీవుడ్ వర్సటైల్ నటుడు ఎస్‌జే సూర్య పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఆయన అడిగిన భారీ రెమ్యునరేషన్ కారణంగా మేకర్స్ ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత బాలీవుడ్ దిగ్గజం జాకీ ష్రాఫ్ పేరు కూడా పరిశీలనకు వచ్చింది. అయితే చివరికి ఈ పవర్‌ఫుల్ పాత్రకు బాలీవుడ్ ప్రముఖ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను తుది ఎంపిక చేసినట్లు సమాచారం. రితేష్ దేశ్‌ముఖ్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌కి జాతీయ స్థాయిలో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ సర్ప్రైజింగ్ కాస్టింగ్ వెనుక ఒక ఆసక్తికరమైన స్నేహ బంధం ఉందనే వార్త ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్‌గా మారింది. రామ్ పోతినేని, కథానాయకి జెనీలియా డిసౌజా మధ్య 'రెడీ' సినిమా సమయం నుంచే మంచి స్నేహం ఉంది. జెనీలియా భర్త అయిన రితేష్ దేశ్‌ముఖ్‌తో కూడా రామ్‌కు మంచి ఆత్మీయ అనుబంధం ఉంది. ఆ ఆత్మీయత, ప్రత్యేకమైన ఫ్రెండ్‌షిప్ వల్లే రితేష్ ఈ టాలీవుడ్ ఎంట్రీ ప్రాజెక్ట్‌కు వెంటనే గ్రీన్ సిగ్నల్

ర మ ప త న న క వ లన గ మ ర న ఆ స ట ర హ ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in