రామ్ చ ర ణ్ అయ్యప్ప భక్తుడు.. అందుకే అభిమానులు ఆయన్ని చూడాలనుకున్నారేమో
Actor ProfileActor

రామ్ చ ర ణ్ అయ్యప్ప భక్తుడు.. అందుకే అభిమానులు ఆయన్ని చూడాలనుకున్నారేమో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రామ్ చ ర ణ్ అయ్యప్ప భక్తుడు.. అందుకే అభిమానులు ఆయన్ని చూడాలనుకున్నారేమో
Chitrajyothy12 Jan 2027
రామ్ చ ర ణ్ అయ్యప్ప భక్తుడు.. అందుకే అభిమానులు ఆయన్ని చూడాలనుకున్నారేమో

ఇరుముడి సినిమాలో రామ్ చ‌ర‌ణ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై డైరెక్ట‌ర్ శివ నిర్వాణ స్పందించారు. ‘ఇరుముడి’ (Irumudi) సినిమాలో రామ్‌చరణ్ (Ram Charan) కనిపిస్తారనే ప్రచారంలో నిజం లేదు. ఆయన అయ్యప్ప భక్తుడు (Ayyappa Swamy) కాబట్టి ఆ వైబ్‌ ఉంటుంది. అందుకే అభిమానులు ఆయన్ని చూడాలనుకున్నారేమో. మా చిత్రం చరణ్‌కి నచ్చాలని కోరుకుంటున్నాను’ అని ‘ఇరుముడి’ చిత్ర దర్శకుడు శివనిర్వాణ (Shiva Nirvana) తెలిపారు. రవితేజ (Ravi Teja), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శివనిర్వాణ మాట్లాడుతూ ‘అయ్యప్ప స్వామి మాల, ఫ్యామిలీ, క్రైమ్‌ అంటూ మూడు లేయర్స్‌లో మా సినిమా కథ సాగుతుంది. ఇలాంటి సరికొత్త కథలో రవితేజలాంటి స్టార్‌హీరో చేసినప్పుడు ఆటోమేటిగ్‌గా జనాల్లో అటెన్షన్‌ వచ్చేస్తుంది. అంచనాలు పెరుగుతాయి. మా విషయంలోనూ అదే జరిగింది. తప్పకుండా అంచనాలు రీచ్‌ అవుతాం. ఈ చిత్రం కోసం నేను అయ్యప్ప మాల కూడా వేసుకున్నాను. చిత్రంలో అయ్యప్ప పూజకు సంబంధించి చూపించిన ప్రతి విషయం ప్రామాణికంగా ఉంటుంది. ఇటీవల విడుదలైన మల్లెపూల పల్లకి పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. సీలేరు ప్రాంతంలో అయ్యప్ప భక్తులు ఈ పాటను ఎక్కువగా పాడుకుంటారని తెలిసి ఆ పాటతో షూటింగ్‌ చేశాం. డప్పు శ్రీను గొంతులో ఈ పాట చిరస్థాయిగా ఉంటుంది’ అని అన్నారు