
న్యూ ఏజ్ మెగాస్టార్ రామ్‌చరణ్ నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ఫిలిం పెద్ది డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. న్యూ ఏజ్ మెగాస్టార్ రామ్‌చరణ్ (Ram charan), జాన్వీ కపూర్ (janhvi kapoor) జంటగా తెరకెక్కిన చిత్రం 'పెద్ది’ (Peddi). 'ఉప్పెన' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఐదేళ్లు సమయం తీసుకుని బుచ్చిబాబు సాన తెరకెక్కించిన చిత్రమిది. జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషఙంచారు. టైటిల్, ఫస్ట్ లుక్ నుంచి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఏఆర్ రెహమాన్ సంగీతంలో విడుదలైన పాటలు కూడా అంచనాలను రెట్టింపు చేశాయి. ఉత్తరాంధ్ర, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథతో రూపొందిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ జూన్ నెల 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది మిక్స్‌డ్ టాక్ సంపాదించుకుంది. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. కనీస రవాణా సౌకర్యం, ఎలాంటి గుర్తింపు లేకుండా విజయనగరంలో ఓ అటవీ ప్రాంతంలోని పల్లె అది. కొండ కింద అని పిలుస్తారు. ఆ కొండ మీదుగా ఓ రైలు వెళ్తుంది. కానీ ఆ ప్రాంతంలో స్టేషన్ లేకపోవడంతో రైలు అక్కడ ఆగదు. కాలి నడకనే విజయనగరం వలస వెళ్లి పని చేసుకుని బతుకుతారు. ఆ కొండ కింద ఉండే వ్యక్తి ‘పెద్ది’ (రామ్ చరణ్). క్రికెట్ అంటే పిచ్చి. మంచి ఆటగాడు కూడా. ఆట కూలీగా అతన్ని ఓ జట్టు పాడుకుని క్రికెట్ ఆట ఆడించి గెలిచి పేరు తెచ్చుకుంటారు. అదే టీమ్ పెద్దిని ఓసారి అవమానిస్తుంది. అందుకు కారణమేంటి? ఆట కూలీగా క్రికెట్ ఆడే పెద్ది కుస్తీ వైపు, ఆ తర్వాత రన్నింగ్ వైపు ఎందుకు వెళ్లాడు. అతను ఉంటే కొండ కింద ప్రాంతానికి భారత దేశంలో గుర్తింపు తీసుకురావడానికి ఏం చేశాడు? ఈ జర్నీలో పెద్దికి, అప్పల సూరికి ఉన్న సంబంధం ఏంటి? పెద్దింటి అమ్మాయి అయిన అచ్చియ్యమ్మ పెద్దిని ఇష్టపడటానికి కారణం ఏంటి?