రేపు తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం.. సాగర్ ఒడ్డున భారీ ఏర్పాట్లు
Actor ProfilePolitician

రేపు తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం.. సాగర్ ఒడ్డున భారీ ఏర్పాట్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రేపు తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం.. సాగర్ ఒడ్డున భారీ ఏర్పాట్లు
Zee Telugu21 Nov 2026
రేపు తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం.. సాగర్ ఒడ్డున భారీ ఏర్పాట్లు

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tomorrow Varuna Yagam: వర్షాభావం ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వర్షాలు భారీగా కురిసి పాడి పంటలు పండాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించనుంది. నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌లో రేపు నిర్వహించనున్న వరుణ యాగం కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాలు, ప్రాజెక్టులు నిండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో వరుణ యాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవిహార్‌లో రేపు తెలంగాణ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి.. సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాలు నిండాలని.. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ వరుణ దేవుడికి ప్రత్యేక పూజలు, యాగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యాగం కోసం విజయవిహార్‌లో ప్రత్యేకంగా యాగశాలను ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు, అర్చకులు పూర్తి చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. విజయవిహార్ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వాహనాల రాకపోకలకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. వరుణ యాగం జరిగే ప్రాంతంలో భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు, జలాశయాలు నిండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లో రేపు

ర ప త ల గ ణ ప రభ త వ వర ణయ గ స గర ఒడ డ న భ ర ఏర ప ట ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in