రైతుల కోసం రైతు మిత్ర పథకం అమలు
Actor ProfilePolitician

రైతుల కోసం రైతు మిత్ర పథకం అమలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రైతుల కోసం రైతు మిత్ర పథకం అమలు
Eenadu24 Dec 2026
రైతుల కోసం రైతు మిత్ర పథకం అమలు

బెంగళూరు (చిత్రదుర్గం): రాష్ట్రంలో సన్నకారు రైతుల కోసం కొత్తగా రైతు మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బెంగుళూరులోని ఫీల్డ్ మార్షల్ మాణిక్ షా మైదానంలో ఏర్పాటు చేసిన పరేడ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో సన్నకారు రైతులకు 50 శాతం అద్దెకు వ్యవసాయ యంత్రాలను సమకూర్చగలరని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి పలు నూతన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దొడ్డబల్లాపురం వద్ద రూ.20 వేల కోట్లతో కొత్తగా పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పోలీసు, సాయుధ బలగాలు, ఎన్‌సీసీ, ఎన్ ఎస్‌ఎస్‌, స్కౌట్స్, గైడ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కవాతును డీకే శివకుమార్ తిలకించారు. బెంగుళూరు (చిత్రదుర్గం): బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుల్లో కిత్తూరు సంస్థానానికి చెందిన కిత్తూరు రాణి చెన్నమ్మ నమ్మినబంటు సంగోలిరాయన్న ధైర్య సాహసాలకు మరో పేరు అని సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన సంగోలిరాయన్న 229వ జయంతి సందర్భంగా బెంగుళూరులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బ్రిటిష్‌ పాలకులకు సింహ స్వప్నంగా మారి, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన సేనాని అని కొనియాడారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఆయన జయంతిని నిర్వహించుకోవడం సంతోషాన్ని కలిగించిందన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు