రాత్రి రాశా.. ఉదయం పూట షూటింగ్ చేసేశాం
Actor ProfileActor

రాత్రి రాశా.. ఉదయం పూట షూటింగ్ చేసేశాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాత్రి రాశా.. ఉదయం పూట షూటింగ్ చేసేశాం
Chitrajyothy5 Jan 2027
రాత్రి రాశా.. ఉదయం పూట షూటింగ్ చేసేశాం

‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’ (Ameer Log). రమణా రెడ్డి సోమ (Ramana Reddy Soma)దర్శకత్వం వహించిన ఈ సినిమాలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించారు. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. రానా దగ్గుబాటి (Rana Daggubati) సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ చిత్రాన్ని తెలుగులో ఆగస్టు 21న గ్రాండ్‌గా విడుదల చేయబోతోంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగం పెంచింది. ఈ సందర్భంగా దర్శకుడు రమణా రెడ్డి సోమ మీడియాతో మాట్లాడి ‘అమీర్ లోగ్’ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మీ నేపథ్యం గురించి చెప్పండి? మాది నల్గొండ జిల్లాలోని రాఘవపురం. 1997లోనే ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కి వచ్చాను. జేఎన్టీయూలో ఆర్టిటెక్ట్ చదివాను. ఆ టైంలోనే ఎక్కువగా సినిమాలు చూస్తుండేవాడ్ని. 2007లోనే ఆఫీస్ స్టార్ట్ చేశాను. అర్కిటెక్చర్ ఇండస్ట్రీలో నాకు ఇరవై ఏళ్ల అనుభవం ఉంది. కరోనా టైంలో సొంత ఊరికి వెళ్లాను. అప్పుడు ఖాళీగా ఉండటంతో ఓటీటీలో మరిన్ని సినిమాలు చూశాను. సినిమాలు తీయాలనే ఆలోచన ఎలా వచ్చింది? కథలు రాయడం, చదవడం నాకు చాలా ఇష్టం. ఆరేడేళ్ల నుంచి కథల నుంచి రాయడం ప్రారంభించాను. నా సొంత అనుభవాలు, చూసిన వాటి నుంచి ఎన్నో రాసేవాడ్ని. తర్వాత సినిమాకి కథలు ఎలా రాయాలని నా స్నేహితుడి ద్వారా నేర్చుకున్నాను. యూట్యూబ్ ద్వారా కొంత నేర్చుకున్నాను. ఆ తర్వాత కొంత మంది ఫ్రెండ్స్ సాయంతో షూటింగ్ సెట్‌కి వెళ్లాను. అలా మెల్లిగా సినిమాలతో నా జర్నీ ప్రారంభమైంది. మొదటి సినీ ప్రయత్నం గురించి చెప్పండి? మూడేళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ తీశాను. రాత్రి రాశా.. ఉదయం పూట షూటింగ్ చేసేశాం. ఊర్లో, సిటీలో