
‘రావణ్’ విషయంలో మరోసారి ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. రావణ్ అరెస్ట్ అయినప్పటి నుంచి ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా యమా యాక్టివ్‌గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ‘రావణ్’ విషయంలో మరోసారి ప్రకాష్ రాజ్ (Prakash Raj) సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. రావణ్ (Raavan) అరెస్ట్ అయినప్పటి నుంచి ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా యమా యాక్టివ్‌గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, ప్రకాష్ రాజ్‌పై బండ్ల గణేష్ (Bandla Ganesh) కూడా అదే రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ‘‘నువ్వు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఎవరి మెప్పు కోసం ఈ డ్రామా? ముందు నీ స్థాయి, నీ బాధ్యత, నీ వ్యక్తిత్వం ఏమిటో ఒకసారి అద్దంలో చూసుకుని, నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో..’’ అంటూ ప్రకాష్ రాజ్‌కు ఇప్పటికే హితబోధ చేసిన బండ్ల గణేష్.. మరోసారి ప్రకాష్ రాజ్ షేర్ చేసిన వీడియోకు కౌంటర్ ఇస్తూ షాకింగ్‌గా రియాక్ట్ అయ్యారు. ‘‘రాత్రి తాగుతావు.. పొద్దున్నే వాగుతావు.. అంతే తప్ప నీ జీవితంలో ఒక్క పని కూడా లేదు. ఒక వ్యాపారం లేదు, ఒక సినిమా లేదు, ఒక షూటింగ్ లేదు. పనికిరాని మాటలు, పనికిరాని పోస్టులు, పనికిరాని గొడవలు.. ఇదే నీ దినచర్య. హాయిగా నీ పని నువ్వు చూసుకుని, సంతోషంగా బతుకు. అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకుని నీ విలువను నువ్వే తగ్గించుకోకు’’.. అని బండ్ల గణేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు కూడా ఆయనకు సపోర్ట్ అందిస్తున్నారు. ‘హిందువులను ధ్వేషించేవారికి సపోర్ట్ చేస్తూ.. నీ బుద్ధి ఏంటో తెలియజేస్తున్నావ్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఇక బండ్ల గణేష్ ఇలా రియాక్ట్ అవడానికి కారణమైన వీడియోలో ప్రకాష్ రాజ్ ఏమంటున్నారంటే.. ‘‘వరుసగా తప్పుడు కేసులు