రాణించిన జైస్వాల్ .. సిరాజ్ మెరుపులు.. టీమిండియా గెలుపు
Actor ProfilePolitician

రాణించిన జైస్వాల్ .. సిరాజ్ మెరుపులు.. టీమిండియా గెలుపు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాణించిన జైస్వాల్ .. సిరాజ్ మెరుపులు.. టీమిండియా గెలుపు
Sakshi21 Nov 2026
రాణించిన జైస్వాల్ .. సిరాజ్ మెరుపులు.. టీమిండియా గెలుపు

శ్రీలంక క్రికెట్‌ ఎలెవెన్‌తో జరిగిన మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 207 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన యశస్వి జైస్వాల్‌ (61 రిటైర్ట్‌ హర్ట్‌) మెరుపు అర్ద సెంచరీ చేసి భారత గెలుపుకు గట్టి పునాది వేశాడు. గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగని కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ కీలక ఇన్నింగ్స్ (44) ఆడాడు. ఆఖర్లో సిరాజ్‌ సిక్సర్లతో (32 నాటౌట్‌; ఫోర్‌, 4 సిక్సర్లు) విరుచుకుపడి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. టార్గెట్‌ 207 లంక ఎలెవెన్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిషాన్‌ మధుష్క (63 రిటైర్డ్‌ హర్ట్‌) అర్ద సెంచరీతో రాణించగా.. అంజల బండార (35), నిపున్‌ ధనంజయ (46) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్‌ బ్రార్‌, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. పడిక్కల్‌ అజేయ శతకం భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 357 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. దేవదత్‌ పడిక్కల్‌ (142 నాటౌట్‌) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్‌ హర్ట్‌) అర్ద సెంచరీతో రాణించగా.. కేఎల్‌ రాహుల్‌ (40), మానవ్‌ సుతార్‌ (41), గుర్నూర్‌ బ్రార్‌ (36 నాటౌట్‌), సరాన్ష్‌ జైన్‌ (22 రిటైర్డ్‌ హర్ట్‌) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అసంక మనోజ్‌, రమేశ్‌ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్‌ దక్కించుకున్నారు. దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. నిషాన్‌ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్‌

ర ణ చ న జ స వ ల స ర జ మ ర ప ల ట మ డ య గ ల ప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in