రెండు స్ట్రయిట్
Actor ProfileActor

రెండు స్ట్రయిట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రెండు స్ట్రయిట్ , నాలుగు డబ్బింగ్ సినిమాలు
Chitrajyothy10 Oct 2026
రెండు స్ట్రయిట్ , నాలుగు డబ్బింగ్ సినిమాలు

తెలుగు సినిమాలు కాస్తంత ఆడుతున్నాయని ఆనందపడుతుండగా, ఈవారం అనువాద చిత్రాలు దాడి మొదలైంది. ఈ శుక్రవారం రెండు స్ట్రయిట్‌ తెలుగు సినిమాలు వస్తుంటే... ఏకంగా నాలుగు అనువాద చిత్రాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' మూవీ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కించారు. అక్కినేని నాగార్జునతో పాటు సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగవంశీ దీనిని నిర్మించారు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇంతవరకూ ఘన విజయాన్ని అందుకోని అఖిల్‌కు 'లెనిన్‌'తో ఆ లోటు తీరుతుందని అంతా అనుకుంటున్నారు. ఆ రకంగా ఈ వారం అందరి దృష్టి ఈ 'లెనిన్‌' మీదే ఉంది. ఇక ఈ వారం వస్తున్న మరో స్ట్రయిట్‌ తెలుగు సినిమా 'వసుదేవసుతం'. ఒకప్పటి బాలనటుడు మహేంద్రన్ హీరోగా నటించిన ఈ సినిమాలో అంబికావాణి హీరోయిన్‌. ఇతర కీలక పాత్రలను జాన్ విజయ్, మైమ్ గోపీ, సురేశ్‌ చంద్ర మీనన్, తులసీ, రాజీవ్‌ కనకాల వంటి ప్రామిసింగ్‌ ఆర్టిస్టులు చేశారు. వైకుంఠ్ బోను దర్శకత్వంలో ధనలక్ష్మీ బాదర్ల నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించడం విశేషం. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సైతం ఆసక్తికరంగానే ఉంది. అయితే థియేటర్లకు జనాన్ని ఏమేరకు తీసుకొస్తుందనేది చూడాలి. ఈ శుక్రవారం ఏకంగా నాలుగు అనువాద చిత్రాలు వస్తున్నాయి. అందులో రెండు తమిళ చిత్రాలు. విశేషం ఏమంటే అందులోని 'లవ్ ఓ లవ్' సినిమాలోని హీరో హీరోయిన్లు తెలుగువాళ్ళకు సుపరిచితులే. ధనుష్‌ మేనల్లుడు పావిష్‌ నారాయణన్ ఇప్పటికే 'జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమాతో తెలుగువారి ముందుకొచ్చాడు. ఆ సినిమాను ధనుషే డైరెక్ట్ చేశాడు. ఇక 'లవ్ ఓ లవ్'లో హీరోయిన్ గా నటించింది తెలుగమ్మాయి నాగ దుర్గ. జానపద గీతాల

ర డ స ట రయ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in