రౌడీషీటర్ బర్త్ డే పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే సందడి
Actor ProfilePolitician

రౌడీషీటర్ బర్త్ డే పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే సందడి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రౌడీషీటర్ బర్త్ డే పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే సందడి
Sakshi7 Nov 2026
రౌడీషీటర్ బర్త్ డే పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే సందడి

బెంగళూరు: తమిళనాడులోని బెంగళూరుకు చెందిన రౌడీషీటర్ దాసా అలియాస్ ‘కింగ్ మేకర్ దాసా’ పుట్టినరోజు వేడుకల్లో యలహంక బీజేపీ శాసనసభ్యుడు ఎస్ఆర్ విశ్వనాథ్ పాల్గొనడం స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. నెలకుంట్ల పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో రౌడీషీటర్ దాసా కేక్ కట్ చేసిన అనంతరం ఎమ్మెల్యే విశ్వనాథ్ ఆయనకు పూలమాల వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎమ్మెల్యేతో పాటు పలువురు స్థానిక బీజేపీ నేతలు కూడా ఈ సంబరాల్లో ప్రత్యక్షమయ్యారు. అయితే ఈ వేడుకల సమయంలో పోలీసులెవ్వరూ అక్కడ లేకపోవడం గమనార్హం. చిక్కజాల పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌గా నమోదైన దాసాపై యలహంక, నెలమంగళ, దాసరహళ్లి ప్రాంతాల్లో భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది కూడా దాసా పుట్టినరోజు వేడుకలకు హాజరైన ఒక బెంగళూరు పోలీసు ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఏడాది ప్రజాప్రతినిధి స్వయంగా రౌడీషీటర్ వేడుకల్లో పాల్గొనడంపై నెటిజన్లు, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మాదానాయకనహళ్లి పోలీసులు స్పందిస్తూ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇది కూడా చదవండి: గోవధ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు! దర్శకుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫొటోలు) ‍ హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి రాశి ఖన్నా (ఫొటోలు) వింబుల్డన్‌ విజేత జానిక్‌ సిన్నర్‌ (ఫొటోలు) వింబుల్డన్‌ ఫైనల్లో భారత క్రికెటర్ల హల్‌చల్‌.. స్పెషల్‌ అట్రాక్షన్‌ వైభవ్‌ సూర్యవంశీ (ఫొటోలు) శంకర్ యాదవ్ ను యాదవు ఇన్‌ఛార్జిగా చేసేందుకు... తంబళ్లపల్లె టీడీపీలో రచ్చ...రచ్చ విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడు ప్రైవేట్ బస్సులు దగ్ధం! నేను మౌనంగా లేను, ఇది ఆరంభం మాత్రమే.. ప్రకాష్ రాజ్ సంచలన వీడియో

ర డ ష టర బర త డ ప ర ట ల బ జ ప ఎమ మ ల య స దడ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in