రెండేళ్లు నరకం అనుభవించా.. బ్రేకప్
Actor ProfileActor

రెండేళ్లు నరకం అనుభవించా.. బ్రేకప్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రెండేళ్లు నరకం అనుభవించా.. బ్రేకప్ పై అనుపమ సంచలన వ్యాఖ్యలు
Sakshi14 Dec 2026
రెండేళ్లు నరకం అనుభవించా.. బ్రేకప్ పై అనుపమ సంచలన వ్యాఖ్యలు

స్టార్‌ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ తన వ్యక్తిగత జీవితంపై తొలిసారి బహిరంగంగా స్పందించారు. గత రెండేళ్లుగా తాను తీవ్ర మానసిక, భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన బ్రేకప్‌తో పాటు ఆ సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. మార్పును ముందే గమనించారు.. ‘ఆ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు వెనుక ఎంతో బాధ ఉంది. గత రెండేళ్లుగా శారీరకంగా, మానసికంగా తీవ్రంగా కుంగిపోయాను. ఆ సమయంలో నార్సిసిస్టిక్‌ అబ్యూజ్‌ను ( ఒక వ్యక్తి తన భాగస్వామిని మానసికంగా భావోద్వేగపరంగా వేధించడం) ఎదుర్కొన్నాను’ అని అనుపమ తెలిపారు. నాలో వచ్చిన మార్పుని కుటుంబ సభ్యులు, స్నేహితులు ముందుగానే గుర్తించారు. బ్రేకప్‌ విషయం బయటకు తెలిసి నెల రోజులే అయినప్పటికీ, తనకు దగ్గరగా ఉన్నవారికి ఈ విషయం ముందే అర్థమైంది’ అని అన్నారు. ‘సోషల్‌మీడియాలో పసుపు రంగు డ్రస్‌లో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసి ‘అనుపమ ఆత్మహత్య చేసుకుంది’ అని రాసి ఉంటే నాకు మరింత ప్రేమ దక్కేదేమో’ అని భావోద్వేగంగా మాట్లాడారు. ఈ రిలేషన్‌షిప్‌ సరైనది కాదని, తాను అందరికీ దూరమవుతున్నానని వారంతా గమనించారని చెప్పారు. నిశ్చితార్థం కోసం.. రిలేషన్‌ ప్రారంభమైన కొద్ది రోజులకే తనను మాజీ ప్రియుడు తన కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడని తెలిపారు. మూడు నెలల్లోనే నిశ్చితార్థం గురించి చర్చలు కూడా జరిగాయని చెప్పారు. అయితే, తనకు మరికొంత సమయం కావాలని చెప్పినట్లు వెల్లడించారు.‘నేను నిశ్చితార్థానికి అంగీకరించి ఉంటే ఆ వివాహం చివరకు విడాకుల వరకు వెళ్లేదేమో. ఆ నిర్ణయం తీసుకున్నది కూడా నేనే’ అని స్పష్టం చేశారు. నార్సిసిస్టిక్‌ అబ్యూజ్‌ గురించి మాట్లాడుతూ.. ‘చాలామంది నార్సిసిస్టిక్‌ వ్యక్తులు తమను తాము ఎక్కువగా ప్రేమిస్తారని అనుకుంటారు. కానీ వాస్తవానికి వారిపై వారికి నమ్మకం ఉండదు. వారి జీవితంలోకి ఎవరినీ రానివ్వాలనుకోరు. ఎప్పుడూ గుర్తింపు కోరుకుంటూ ఉంటారు’ అని వివరించారు. కెరీర్‌పై ప్రభావం.. తన వ్యక్తిగత జీవితం

ర డ ళ ల నరక అన భవ చ బ ర కప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in