రెండు రోజుల్లో రికార్డు వసూళ్లు... దూసుకుపోతున్న అఖిల్ 'లెనిన్
Actor ProfileActor

రెండు రోజుల్లో రికార్డు వసూళ్లు... దూసుకుపోతున్న అఖిల్ 'లెనిన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రెండు రోజుల్లో రికార్డు వసూళ్లు... దూసుకుపోతున్న అఖిల్ 'లెనిన్
AP7AM31 Oct 2026
రెండు రోజుల్లో రికార్డు వసూళ్లు... దూసుకుపోతున్న అఖిల్ 'లెనిన్

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 37.2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో అఖిల్ ఊరమాస్ నటనకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.మంచి మౌత్ టాక్ రావడంతో సినిమా వసూళ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. "ప్రేక్షకుల మౌత్ టాక్ అద్భుతంగా పనిచేస్తోంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 37.2 కోట్ల గ్రాస్ సాధించి 'లెనిన్' దూసుకుపోతోంది" అంటూ నిర్మాణ సంస్థ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. చాలా కాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ సినిమా రూపంలో అది లభించడంతో అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. ఎస్‌ఎస్ తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని ప్రేక్షకులు చెబుతున్నారు. వీకెండ్ ముగిసే నాటికి ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు

ర డ ర జ ల ల ర క ర డ వస ళ ల ద స క ప త న న అఖ ల ల న న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in