
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఇండస్ట్రీలో హీరోలు నటించిన సినిమాలు రోజుల వ్యవధిలో విడుదల కావడాన్ని చూస్తుంటాం. కానీ, ఓ అగ్రకథానాయిక నటించిన రెండు సినిమాలు 48 గంటల వ్యవధిలో థియేటర్‌లలో సందడి చేయడం అరుదు. ప్రస్తుతం నయనతార (Nayanthara) సరిగ్గా ఇలాంటి అరుదైన రికార్డుతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. సాధారణంగా నయనతార తన సినిమాల ప్రమోషన్‌లకు, ఈవెంట్‌లకు దూరంగా ఉంటారు. కానీ ఈసారి తన శైలిని మార్చుకొని ప్రచారంలో జోరు పెంచారు. ‘టాక్సిక్’ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొనడమే కాకుండా, ‘హాయ్’ సినిమా ప్రమోషన్లలో కూడా యాక్టివ్‌గా పాల్గొంటూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. తాను ప్రచారానికి దూరంగా ఉండడానికి ప్రత్యేక కారణాలు ఏవీ లేవని.. ఈ విషయంలో తాను అంత సమర్థురాలిని కాదని, అందుకే దూరంగా ఉంటానని తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ‘ముందు కాలుస్తాం.. తర్వాత మాట్లాడతాం..’ అంటున్నారు టబు. అన్షు, వాసవి గణేశన్ జంటగా రూపొందిన చిత్రం ‘హుషార్ పిట్టలు’