రెండో రోజుకు చేరిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రశ్నోత్తరాల్లో ఏం చర్చించనున్నారంటే
Actor ProfilePolitician

రెండో రోజుకు చేరిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రశ్నోత్తరాల్లో ఏం చర్చించనున్నారంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రెండో రోజుకు చేరిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రశ్నోత్తరాల్లో ఏం చర్చించనున్నారంటే
Andhra Jyothy7 Jan 2027
రెండో రోజుకు చేరిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రశ్నోత్తరాల్లో ఏం చర్చించనున్నారంటే

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ (మంగళవారం) రెండో రోజు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించనున్నారు. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ (మంగళవారం) రెండో రోజు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నిర్ణయాల నివేదికను సభ ముందు సీఎం చంద్రబాబు ఉంచనున్నారు. అనంతరం విద్యుత్ శాఖకు సంబంధించిన జీవో ఆర్‌టీ నం.27ను మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటెనెన్స్‌ యాక్ట్‌-1971 ప్రకారం ఈ జీవోను సభ ముందు పెట్టనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ లైబ్రరీస్‌ (అమెండ్‌మెంట్‌) బిల్లు-2026పై కీలక ప్రక్రియ జరగనుంది. సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరడంతోపాటు.. బిల్లును పరిశీలనకు తీసుకోవాలని, అనంతరం ఆమోదించాలని మంత్రి నారా లోకేశ్‌ ప్రతిపాదించనున్నారు. అలాగే, ‘సూపర్‌ సిక్స్‌-ప్రజా సంక్షేమం’పై సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. సూపర్‌ సిక్స్‌ పథకాలు, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంపై ఎమ్మెల్యే దాసరి సుధ ప్రశ్నించనున్నారు. గత రెండేళ్లలో స్వయం సహాయక సంఘాలకు విడుదల చేసిన వడ్డీ లేని రుణాల వివరాలనూ ఆమె కోరనున్నారు. 25 వేలకుపైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ చేసే ప్రతిపాదనపై ప్రశ్నలు రానున్నాయి. కోవూరు గ్రామ పంచాయతీని కూడా అప్‌గ్రేడ్‌ చేసే జాబితాలో చేర్చారా? అనే అంశంపై సభ్యులు ప్రశ్నించనున్నారు. కోనసీమలో వృద్ధాప్య దశకు చేరిన కొబ్బరి తోటల అంశం సభ ముందుకు రానుంది. కొబ్బరి తోటల పునరుజ్జీవనం, తిరిగి నాటే కార్యక్రమాలపై కొబ్బరి అభివృద్ధి బోర్డుతో కేంద్రం జరిపిన సంప్రదింపుల వివరాలను కోరనున్నారు. అర్హులైన కొబ్బరి రైతులకు కొత్త మొక్కలు

ర డ ర జ క చ ర న ఏప అస బ ల సమ వ శ ల ప రశ న త తర ల ల ఏ చర చ చన న న ర ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in