విధి రాత అనుకూలించకపోతే ఎంతటి గొప్పవాళ్లయినా కాలప్రవాహంలో కన్నీటి చుక్కలుగా మిగిలిపోవాల్సిందే అనడానికి గ్లామర్ ప్రపంచంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సినిమా రంగం అనేది కేవలం రంగుల ప్రపంచం మాత్రమే కాదు
రోడ్డు మీద సిగరెట్ పీకలు ఏరుకుని తాగేవాడు
భారతీయ సినిమా ప్రపంచంలో రజనీకాంత్ అనే పేరు ఒక సంచలనం. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఏమాత్రం లేకుండా, కేవలం ఒక సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది గుండెల్లో 'సూపర్ స్టార్'గా నిలిచిన ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం. తెరపై ఆయన చూపించే మేనరిజమ్స్, స్టైల్ ప్రేక్షకులను ఎంతగా ఉర్రూతలూగిస్తాయో, వ్యక్తిగతంగా ఆయన పాటించే సింప్లిసిటీ అంతకంటే ఎక్కువగా ఆకట్టుకుంటుంది. అయితే రజనీకాంత్ సాధించిన ఈ శిఖరసమాన విజయం వెనుక కొన్ని దశాబ్దాల కష్టం, కన్నీళ్లు, ఆకలి, అవమానాలు దాగున్నాయి. తాజాగా రజనీకాంత్ కెరీర్ తొలినాళ్లలో అనుభవించిన అత్యంత దారుణమైన పేదరికం, ఆయన పడిన తపన గురించి సీనియర్ నటుడు భానుచందర్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.* వాడి కోసమే నా రూల్స్ అన్నీ మార్చేసుకున్నా... స్టోరీ సెలక్షన్స్‌పై కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్రజనీకాంత్ ప్రాథమిక జీవితాన్ని విశ్లేషిస్తూ భానుచందర్ ఆయన్ను ఆకాశానికెత్తేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనే లక్షణాన్ని రజనీకాంత్‌ను చూసే నేర్చుకోవాలని, ఆయన కేవలం ఒక సూపర్ స్టార్ మాత్రమే కాదు, అంతకుమించి 'సూపర్ డూపర్ మెగాస్టార్' అంటూ కొనియాడారు. రజనీకాంత్ బెంగళూరులో బస్ కండక్టర్‌గా చేస్తున్న సురక్షితమైన ఉద్యోగాన్ని వదులుకొని, నటనపై ఉన్న పట్టుదలతో మద్రాస్ నగరంలో అడుగుపెట్టిన రోజూల నాటి ముచ్చట్లను ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో రజనీకాంత్ వద్ద కనీసం గది అద్దె కట్టుకోవడానికి కూడా డబ్బులు ఉండేవి కావట. దీంతో కొందరు స్నేహితులు ఉండే రూమ్‌కు వెళ్లి.. "నా దగ్గర డబ్బుల్లేవు, కానీ మీ అందరికీ ఇంట్లో పనులన్నీ చేసి పెడతాను, నన్ను మీతో ఉంచుకోండి" అని బతిమిలాడి అక్కడ ఆశ్రయం పొందారని భానుచందర్ ఆనాటి కఠిన పరిస్థితులను వివరించారు.* బాలయ్య-కొరటాల మూవీ క్రేజీ అప్‌డేట్... 20 రోజుల పాటు పవర్‌ఫుల్ యాక్షన్ షెడ్యూల్!రజనీకాంత్‌కు మొదటి నుంచి సిగరెట్